షాకింగ్: ఒక్క రోజులో 10 కరోనా టీకాలు వేయించుకున్నాడు..! అతడికి ఏమౌతుందో చెప్పలేమంటున్న శాస్త్రవేత్తలు..

ABN , First Publish Date - 2021-12-13T03:19:51+05:30 IST

రెండు కరోనా టీకాలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండని ప్రభుత్వాలు బతిమాలుతున్నా ప్రజలు పట్టించుకోని పరిస్థితి ప్రస్తుతముంది. అలాంటిది.. ఓ వ్యక్తి ఒక్క రోజులో ఏకంగా పది సార్లు కరోనా టీకా తీసుకున్నాడు.

షాకింగ్:  ఒక్క రోజులో 10 కరోనా టీకాలు వేయించుకున్నాడు..! అతడికి ఏమౌతుందో చెప్పలేమంటున్న శాస్త్రవేత్తలు..

ఇంటర్నెట్ డెస్క్: కేవలం రెండు కరోనా టీకా డోసులు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండని ప్రభుత్వాలు బతిమాలుతున్నా ప్రజలు పట్టించుకోని పరిస్థితి ప్రస్తుతముంది. అలాంటిది.. ఓ వ్యక్తి ఒక్క రోజులో ఏకంగా పది సార్లు కరోనా టీకా తీసుకున్నాడు. న్యూజిల్యాండ్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. టీకాలు తీసుకోవడం ఇష్టం లేని వారు తనకు డబ్బులిచ్చి వారి బదులు వ్యాక్సిన్‌ తీసుకోమన్నారని అతడు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో.. అక్కడి అధికారులు అతడిపై విచారణ ప్రారంభించారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచించారు. కాగా.. అతడి ఆరోగ్యంపై 10 టీకాలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీకాల భద్రతపై ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల్లో ఎక్కడా ఇలాంటి సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వారు చెబుతున్నారు.  



Updated Date - 2021-12-13T03:19:51+05:30 IST