కనిగిరి దొరువులో పడి వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-19T07:21:48+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతూ వ్యక్తి దొరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది.

కనిగిరి దొరువులో పడి వ్యక్తి ఆత్మహత్య
మృతదేహాన్ని బయటకు తీయిస్తున్న పోలీసులు

కనిగిరి, జూన్‌ 18: ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతూ వ్యక్తి దొరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని హనుమాన్‌ భజన సంఘం వీధిలో నివాసం ఉంటున్న కొలిపాకుల సాయిబాబా (47) దొరువులోపడి ఆత్మహత్య చే సుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన  ఆయన మధ్యాహ్నం 12 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌కు అందుబాటులో ఉన్నా డు. మధ్యాహ్నం నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ఈ క్రమంలో గురువారం నుంచి కనపడని వ్యక్తి శుక్రవారం దొరువులో శవమై తేలడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 

నాడు పేరున్న వ్యాపారి 

కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలో భవన నిర్మాణాలకు, ఇతర ఇనుప పనిముట్లు అమ్మకంలో ఆయనకు పదిహేనేళ్ల క్రితం మంచి పేరుండేది. వచ్చే ఆదాయంతో ఆర్థికంగా స్థితిమంతుడుగానే ఉండేవాడు. అనంతరం ఆయన  వైట్‌క్వార్జ్‌ వ్యాపారంలో అడుగు పెట్టాడు. అయితే భాగస్వాములతో విభేదాలు, వ్యాపార నష్టాలు ఆయన్ను అప్పుల ఊబిలోని జారుకున్నారు.  తన వద్ద అప్పుగా తీసుకున్న వారు ఇవ్వకపోవటం, తాను అప్పులు కట్టాల్సి రావడం మరింత బాధించింది. దీంతో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని నగరంలో చర్చ జరుగుతోంది.

ఆర్ధిక ఇబ్బందులతోనే : ఎస్‌ఐ రామిరెడ్డి

 పట్టణంలోని దొరువులో పడి శుక్రవారం మృతి చెందిన కొలిపాకుల సాయిబాబా అనే వ్యక్తి మృత దేహం బయట పడింది.  ఈ మేరకు వారి కుటుంబ సభ్యులను విచారించగా ఆర్ధిక ఇబ్బందులతోనే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. 

Updated Date - 2021-06-19T07:21:48+05:30 IST