భార్య మాట్లాడడంలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-05T06:26:08+05:30 IST

కాకినాడ క్రైం, డిసెంబరు 4: భార్య అలిగి పుట్టింటికి వెళ్లి పోయి మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో జగన్నాథపురం వంతెనపై నుంచి ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించిన సంఘటన శుక్రవారం కాకినాడ

భార్య మాట్లాడడంలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవిని రక్షించి తీసుకువస్తున్న పోలీసులు

రక్షించిన పోలీసులు

కాకినాడ క్రైం, డిసెంబరు 4: భార్య అలిగి పుట్టింటికి వెళ్లి పోయి మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో జగన్నాథపురం వంతెనపై నుంచి ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించిన సంఘటన శుక్రవారం కాకినాడ జగన్నాథపురంలో జరిగింది. జగన్నాథపురం పరదేశమ్మపేట పేర్లవారివీఽధికి చెందిన కసిరెడ్డిరవి (50) సివిల్‌ ఇంజనీర్‌. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్యభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని విజయవాడలో పుట్టింటికి వెళ్లిపోయింది. అలిగి వెళ్లిపోయిన భార్యతో మాట్లాడేందుకు రవి ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించాడు. ఎంతకీ ఫోన్‌ తీయకపోవడం, మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దాంతో జగన్నాథపురం ఎన్టీఆర్‌ బ్రిడ్జిపై నుంచి ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి హుటాహుటినా గజఈతగాళ్ల సాయంతో మునిపోతోన్న రవిని రక్షించి పైకి తీసుకొచ్చారు. స్థానిక వన్‌టౌన్‌కు తీసుకెళ్లి పోలీసులు కౌన్సిలింగ్‌ చేసి ఇంటికి సిబ్బంది నిచ్చి పంపించారు. రవిని కాపాడేందుకు విశేష కృషి చేసిన ట్రాఫిక్‌ పోలీసులను పలువురు అభినందించారు. 

Updated Date - 2020-12-05T06:26:08+05:30 IST