ఉబెర్ అనుకొని పొరపాటు పడిన యువతి.. 120 సార్లు కత్తితో పొడిచి చంపిన వ్యక్తి!

ABN , First Publish Date - 2021-07-30T11:06:57+05:30 IST

ఆమె ఉబెర్ కారు బుక్ చేసుకుంది. కాసేపటికి ఒక కారు వచ్చి ఆమె దగ్గరలో ఆగింది. అదే తన కారు అనుకొని పొరబాటు

ఉబెర్ అనుకొని పొరపాటు పడిన యువతి.. 120 సార్లు కత్తితో పొడిచి చంపిన వ్యక్తి!

వాషింగ్టన్: ఆమె ఉబెర్ కారు బుక్ చేసుకుంది. కాసేపటికి ఒక కారు వచ్చి ఆమె దగ్గరలో ఆగింది. అదే తన కారు అనుకొని పొరబాటు పడిన ఆ యువతి వెళ్లి వెనుక సీట్లో కూర్చుంది. అంతే హటాత్తుగా వెనక్కు తిరిగిన డ్రైవర్.. కారు తలుపులు తెరుచుకోకుండా చైల్డ్ లాక్ ఆన్ చేసి, ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 120 సార్లు ఆమెను పొడిచి పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో 21ఏళ్ల సమంతా జోసెఫ్సన్ అనే యువతి దుర్మరణం పాలైంది. ఆమెను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నథానియేల్ రోలాండ్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికా కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ ఘోరం 2019లో జరిగింది. సమంతాను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని రోడ్డు పక్కన చెట్లలో పడేసిన రోలాండ్.. తన దారిన తాను వెళ్లిపోయాడు. అతన్ని అరెస్టు చేసిన సమయంలో రోలాండ్ కారులో సమంత రక్తం, మొబైల్ దొరికాయి.

Updated Date - 2021-07-30T11:06:57+05:30 IST