Nupur Sharma video: వీడియో చూసిన వ్యక్తిని కత్తితో పొడిచారు...నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-19T16:05:38+05:30 IST

ముహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ వీడియో చూసిన వ్యక్తిని కత్తితో పొడిచిన దారుణ ఘటన...

Nupur Sharma video: వీడియో చూసిన వ్యక్తిని కత్తితో పొడిచారు...నిందితుల అరెస్ట్

 పాట్నా(బీహార్): ముహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ (Nupur Sharma)వీడియో(video) చూసిన వ్యక్తిని కత్తితో పొడిచిన(stabbed) దారుణ ఘటన బీహార్‌( Bihar) రాష్ట్రంలోని సీతామర్హిలో తాజాగా వెలుగుచూసింది. బీహార్‌లోని సీతామర్హి (Sitamarhi)జిల్లాలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు ఒక యువకుడిని కొందరు వ్యక్తులు పలుమార్లు కత్తితో పొడిచారు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలపై సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ తీవ్ర దుమారాన్ని రేపారు.బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఒక యువకుడు నూపుర్ శర్మ వీడియోను చూశాడని(watching) ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు పలుసార్లు కత్తితో పొడిచారు.అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన దాడికి వ్యక్తిగత శత్రుత్వమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు(police) కేసు నమోదు చేసినా కానీ అందులో నూపుర్‌ శర్మ ప్రస్తావన లేదు. 


ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బహెరా గ్రామానికి చెందిన అంకిత్ ఝా అనే బాధితుడు ప్రస్తుతం దర్భంగాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కత్తిపోటు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.అంకిత్ ఝా అనే వ్యక్తి తన పాన్ షాప్‌లో మొబైల్ ఫోన్‌లో నుపుర్ శర్మ వీడియోను చూస్తున్నట్లు పేర్కొన్నాడు.మహ్మద్ బిలాల్ నేతృత్వంలో నలుగురు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. తాను నూపుర్ శర్మ వీడియోను చూస్తున్నందున వారికి తనపై కోపం వచ్చిందని ఝా అన్నారు. వారు అతనిని దుర్భాషలాడటానికి ముందు అతని నడుముపై కత్తితో ఆరుసార్లు పొడిచారు.మరోవైపు ఇద్దరు స్నేహితులు పాన్ షాపులో పాన్ తింటుండగా దుకాణంలో విక్రయించే గంజాయిపై వారి మధ్య వాగ్వాదం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. 


ఇది కత్తిపోట్లకు దారి తీసిందని డీఎస్పీ చెప్పారు.కాగా నూపుర్ శర్మ వీడియో కారణంగా అంకిత్ ఝాపై దాడి జరిగిందని అతని కుటుంబం పేర్కొంది. ఈ కేసులో మహ్మద్ బిలాల్‌తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చినట్లు బాధితుడి తండ్రి మనోజ్ ఝా తెలిపారు.నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు సూరత్ వ్యాపారవేత్తను బెదిరించినందుకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తల నరికి చంపిన టైలర్ కన్హయ్యాలాల్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత తనకు ప్రాణహాని తలపెడతామని బెదిరింపులు వచ్చాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా పేర్కొన్నారు.మీనా ఇటీవల కన్హయ్యాలాల్ కుటుంబానికి ఒక నెల జీతాన్ని సాయంగా ఇచ్చారు. 


Updated Date - 2022-07-19T16:05:38+05:30 IST