స్నేహితుడి భార్యపై కన్ను.. ఒంటరిగా ఆమె చేత కూల్‌డ్రింక్ తాగించి..

ABN , First Publish Date - 2022-04-15T08:38:16+05:30 IST

ఆ యువకుడు తన స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. తరచుగా ఆమె కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు.. ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించేవాడు.. ఆమె లొంగకపోవడంతో అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేశాడు.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి మత్తమందు కలిపిన కూల్‌డ్రింక్...

స్నేహితుడి భార్యపై కన్ను.. ఒంటరిగా ఆమె చేత కూల్‌డ్రింక్ తాగించి..

ఆ యువకుడు తన స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. తరచుగా ఆమె కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు.. ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించేవాడు.. ఆమె లొంగకపోవడంతో అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేశాడు.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి మత్తమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు. 


వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పాల్వాల్‌‌కు చెందిన ఓ వివాహితపై ఆమె భర్త స్నేహితుడు ఈ నెల 9వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించి మహిళతో మంచిగా మాట్లాడుతూ ఆమె చేత మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ అక్కణ్నుంచి పరారయ్యాడు. బాధితురాలు తన భర్తకు జరిగిన మొత్తం విషయం చెప్పింది. 


అనంతరం భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు గతంలో కూడా తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. కేసు నమోద చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నారు.


Updated Date - 2022-04-15T08:38:16+05:30 IST