చేయని తప్పుకి 54 ఏళ్లు జైలు శిక్ష.. అనుకోకుండా 20 ఏళ్ల తరువాత ఒక ఉత్తరంతో నిర్దోషి అని విడుదల.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-07T05:52:17+05:30 IST

చేయని తప్పుకి ఒక వ్యక్తి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అనుకోకుండా ఒకరోజు జైలులో ఉన్న అతడికి ఆ నేరం చేసిన వ్యక్తి ఉత్తరం రాశాడు. ఆ నేరం తాను చేశానని.. తనను క్షమించమని కోరాడు...

చేయని తప్పుకి 54 ఏళ్లు జైలు శిక్ష.. అనుకోకుండా 20 ఏళ్ల తరువాత ఒక ఉత్తరంతో నిర్దోషి అని విడుదల.. అసలేం జరిగిందంటే..

చేయని తప్పుకి ఒక వ్యక్తి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అనుకోకుండా ఒకరోజు జైలులో ఉన్న అతడికి ఆ నేరం చేసిన వ్యక్తి ఉత్తరం రాశాడు. ఆ నేరం తాను చేశానని.. తనను క్షమించమని కోరాడు. దీంతో న్యాయాధికారులు విచారణ చేసి అతడిని విడుదల చేశారు. ఈ విచిత్ర ఘటన అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల క్రితం చికాగో నగరానికి చెందిన దుగర్ అనే యువకునికి ఒక హత్య కేసులో న్యాయస్థానం  54 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ సమయంలో కోర్టులో దుగర్ తాను నిర్దోషినని ఎంత వాదించినా ఎవరూ నమ్మలేదు. పైగా ప్రత్యక్ష సాక్షులు దుగర్ ఈ నేరం చేయడం తాము కళ్లారా చూశామని చెప్పారు. కానీ ఇటీవల ఒకరోజు జైలులో ఉన్న దుగర్ కోసం ఒక ఉత్తరం వచ్చింది. అది చదివిన దుగర్ ఆశ్చర్యపోయాడు. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి అతని సోదరుడు స్మిత్. 


స్మిత్ ఆ ఉత్తరంలో తన తమ్ముడిని క్షమించమని కోరాడు. 20 ఏళ్ల క్రితం ఆ హత్య చేసింది తానేనని తన నేరం అంగీకరించాడు. స్మిత్, దుగర్ ఇద్దరూ కవలలు. 20 ఏళ్ల క్రితం ఇద్దరూ కలిసి చికాగోలో డ్రగ్స్ అక్రమ రవాణా, దొంగతనాలు చేసేవారు. కొంతకాలం తరువాత ఇద్దరూ విడిపోయారు. ఒకసారి స్మిత్ దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో తుపాకీతో కాల్పులు చేశాడు. ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. కానీ పోలీసులు స్మిత్‌కు బదులుగా దుగర్‌ని అరెస్టు చేశారు. కోర్టులో ప్రత్యక్ష స్యాక్షులు కూడా దుగర్ ఆ హత్యలు చేశాడని చెప్పారు. దీంతో కోర్టు దుగర్‌కు 54 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


ఆ సమయంలో దుగర్‌కు తన సోదరుడిపై అనుమానం వచ్చింది. కానీ స్మిత్ తాను ఆ హత్య చేయలేదని చెప్పాడు. దీంతో దుగర్ జైలుకే తన జీవితం అంకితమనుకున్నాడు. కానీ 20 ఏళ్ల తరువాత స్మిత్ మరో హత్య కేసులో పట్టుబడ్డాడు. ఈ సారి అతనికి 99 ఏళ్ల జైలు శిక్ష పడింది. పైగా స్మిత్ ఆరోగ్యం బాగోలేదు. ఈ పరిస్థితుల్లో స్మిత్ తన సోదరుడు దుగర్‌కి ఒక ఉత్తరం రాశాడు. తను ఎంతో కాలం జీవించనని.. చనిపోయేముందు తను చేసిన నేరాలకు పశ్చాత్తాపం చేసుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నానని చెప్పాడు. 


స్మిత్ ఉత్తరం ఆధారంగా చికాగో కోర్టులో.. దుగర్ తను నిర్దోషినంటూ మళ్లీ పిటిషన్ వేశాడు. కానీ కోర్టులో జైలులో శిక్ష అనుభవిస్తున్న స్మిత్ వాంగ్మూలం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దుగర్ పైకోర్టులో అప్పీలు చేశాడు. అక్కడ దుగర్ నిర్దోషిగా విడుదలయ్యాడు.


Updated Date - 2022-02-07T05:52:17+05:30 IST