గాలిలో ఈ కుర్రాడి సైకిల్ ఫీట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

ABN , First Publish Date - 2022-04-09T14:18:01+05:30 IST

గాలిలో ఈ కుర్రాడి సైకిల్ ఫీట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

గాలిలో ఈ కుర్రాడి సైకిల్ ఫీట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫలు థ్రిల్లింగ్ వీడియోలు అందరినీ విపరీతంగా అలరిస్తున్నాయి. వీటిని యూజర్లు అమితంగా ఇష్టపడుతున్నారు. అడ్వెంచర్ గేమ్‌ల వీడియోలు.. యూజర్స్‌ని థ్రిల్‌కి గురిచేస్తున్నాయి. ఈ కారణంగానే అడ్వెంచర్ స్పోర్ట్స్ వీడియోలు సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక వీడియో అందరినీ కన్నార్పకుండా చూసేలా చేస్తోంది. సైకిల్‌ను సాధారణంగా తొక్కడాన్ని మనం చూసేవుంటాం. అయితే దీనికి భిన్నంగా ఒక యువకుడు అత్యంత సాహసోపేత రీతిలో సైకిల్ తొక్కుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను యూజర్స్ ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నారు. 


ఈ వీడియోలో ఒక యువకుడు పర్వత ప్రాంతంలో సైకిల్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ సోషల్ మీడియాలో అత్యంత వేగంగా షేర్ అవుతోంది. దీనిని డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఆ యువకుడు సైకిల్‌‌ను గాలిలోకి లేపి.. పల్టీ కొట్టించి తిరిగి నేలపై వాలి సైకిల్ సవారీ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యూజర్ల ఎక్సైట్‌మెంట్ స్థాయిని పెంచుతున్న ఈ వీడియో అందరికీ ఫేవరెట్‌గా మారుతోంది. వీడియోలో విన్యాసాలు చేస్తున్న వ్యక్తి చేస్తున్న బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉందని యూజర్స్ అంటున్నారు. అలాగే అతని సైకిల్ విన్యాసాలను తెగ మెచ్చుకుంటున్నారు. 



Updated Date - 2022-04-09T14:18:01+05:30 IST