పెళ్లైన కొత్తజంట.. భార్య పెట్టే ఖర్చులు భరించలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఓ భర్త.. విషయం ఆన్‌లైన్‌కి ఎక్కడంతో..

ABN , First Publish Date - 2021-10-23T06:01:06+05:30 IST

షాపింగ్‌ వెళితే ఆడవాళ్లు ఎలా ఖర్చు చేస్తారో వేరే చెప్పక్కర్లేదు. అవసరం ఉన్నవి, లేనివి, తక్కువ ఎక్కువ అనే ఆలోచన ..

పెళ్లైన కొత్తజంట.. భార్య పెట్టే ఖర్చులు భరించలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఓ భర్త.. విషయం ఆన్‌లైన్‌కి ఎక్కడంతో..

షాపింగ్‌ వెళితే ఆడవాళ్లు ఎలా ఖర్చు చేస్తారో వేరే చెప్పక్కర్లేదు. అవసరం ఉన్నవి, లేనివి, తక్కువ ఎక్కువ అనే ఆలోచన లేకుండా ఖర్చుపెట్టేస్తుంటారు. ఈ మాట చాలా మంది భర్తలు చెబుతుంటారు. ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే.. ఇదే విషయంపై ఓ రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అతడు తన పోస్ట్‌లో చెప్పిన విషయాల ప్రకారం.. అతడికి ఈ మధ్యనే పెళ్లైంది. అతడి భార్య షాకింగ్‌కి వెళ్లిందంటే వందల డాలర్లు ఆవిరి కావాల్సిందే. పెళ్లైన తర్వాత దాదాపు 7 నెలల పాటు ఆమె షాపింగ్‌కు అంతు లేకుండా పోయింది. ఇదంతా చూసి అతడికి మైండ్ బ్లాక్ అయ్యేది. ఇక ఒక రోజు ఏకంగా ఓ కోట్ కోసం 550 డాలర్లను ఆమె ఖర్చు చేయడంతో అతడికి చిర్రెత్తుకొంచ్చింది. వెంటనే కూర్చోబెట్టి ఆమె ఖర్చులపై బడ్జెట్ వేసి.. ఇక షాకింగ్‌లు చేయడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. ‘నువ్వు పురుషాహంకారం ప్రదర్శిస్తున్నావ్’ అని కోప్పడింది. కానీ అతడు వెనక్కి తగ్గలేదు. బడ్టెజ్ పాటించాల్సిందేనని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు.


తాను ఏ మాత్రం షాపింగ్‌లు చేయనని, అందుకే ఇప్పటివరకు తాము మునిగిపోలేదని, లేకపోతే.. ఇప్పటికి ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయేవారమని అతడు తన పోస్ట్‌లో చెప్పాడు. ఇలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల ఇకపై ఈ సమస్య ఉండదని అతడు రాసుకొచ్చాడు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ‘పెళ్లికి ఆమె ఇలా ఖర్చుపెట్టేది కాదా.. అప్పుడు లేనిది ఇప్పుడెలా అలవాటు వచ్చింది. ఒకవేళ అప్పటి నుంచే ఉంటే నీకు నచ్చే కదా చేసుకున్నావ్.. ఇప్పుడు కొత్తగా ఆంక్షలేంటి..?’ అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో ‘బడ్జెట్ పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ ఓ ఆలోచనకు వచ్చి సరైన బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి’ అని అంటున్నారు. ఇక మరికొంతమందేమో.. ‘ఆమె ఉద్యోగం చేయదా..? చేస్తుంటే ఆమె డబ్బు ఆమె ఇష్టం. ఇద్దరికీ వచ్చే డబ్బును మూడు భాగాలు చేయడం. ఒకటి మీది, ఒకటి ఆమెది, మరొకటి కుటుంబానిది. ఇలా భాగాలు చేసిన తర్వాత మీ వాటా డబ్బులు నచ్చినట్లు ఖర్చుపెట్టుకోండి’ అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరి మీరేమంటారు. బడ్జెట్ వేయడం కరెక్టేనా..? కాదా..!

Updated Date - 2021-10-23T06:01:06+05:30 IST