Abn logo
Sep 24 2021 @ 01:45AM

అబ్బే అదంతా ఉత్తిదే.. లాటరీ లేదు.. డబ్బులేమీ రాలే..

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. మనం చెప్పే చిన్న అబధ్ధం చాలా పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. సరిగ్గా అదే జరిగింది కేరళకు చెందిన సాయితలవి అనే వ్యక్తి విషయంలో. రెండు రోజుల క్రితం ఓ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకన్నానంటూ అతడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అతడికి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. అంతేకాకుండా మీడియా ఛానళ్ల నుంచి, బంధువుల నుంచి భారీగా ఫోన్లు రావడం మొదలు పెట్టాయి. ఊపిరాడకుండా చేశారంతా.

వారందరికీ సాయతలవి ఒకటే సమాధానం చెప్పాడు. దుబాయ్‌లో తనకు అహ్మద్ అనే ఓ స్నేహితుడు ఉన్నాడని, అతడి ద్వారానే ఈ లాటరీ టికెట్ కొన్నానని, అదే టికెట్‌కు లాటరీ తగిలిందని ఫేస్‌బుక్‌లో చెప్పాడు. అయితే తాజాగా తేలిన విషయం ఏంటంటే.. సాయితలవి లాటరీ టికెట్ అసలు కొననేలేదట. టికెట్ కొనాలని ఒత్తిడి చేయడంతో అప్పటికే రిజల్ట్ వచ్చిన లాటరీలో గెలిచిన టికెట్‌ను ఫోటో తీసి పంపానని, అక్కడే పెద్ద సమస్య వచ్చిపడిందని అహ్మద్ చెప్పడంతో అసలు విషయం బయటకొచ్చింది. లాటరీ కొనలేదని, ఆ టికెట్ పాతదని సాయితలవికి చెబితే మొదట ఆశ్చర్యపోయాడు. అయితే తన పేరున తన స్నేహితుడు అహ్మద్ అసలు ఒక్క టిక్కెట్ కూడా కొనలేదట.

దీనిగురించి అహ్మద్ మాట్లాడుతూ.. అప్పటికే గెలుపు సాధించిన ఓ టికెట్ ఫోటోను మాత్రమే తన స్నేహితుడు సాయితలవికి పంపానని, అంతేకానీ అతడు ఎలాంటి లాటరీ గెలుచుకోలేదని వివరించాడు. విషయం తెలుసుకున్న తరువాత సాయితలవి మొదట బాధపడినా.. తాను కోటీశ్వరుడిననే అందరికీ చెబుతానని, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావచ్చని అన్నట్లు అహ్మద్ వివరించాడు. అందుకే తాను కూడా సహకరించానని అహ్మద్ వివరించాడు. అంతేకానీ అతడు ఎలాంటి లాటరీలో గెలవలేదని తెలిపాడు. అయితే ఎవరినీ మోసం చేసే ఉద్దేశం అతడికి లేదని, కేవలం సరదా కోసమే సాయితలవి అలా చేశాడని అహ్మద్ వివరించాడు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...