కారు నుంచి ఏదో లీక్ అవుతోందని ఆపిన దుండగడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-06T05:35:27+05:30 IST

అతను ఓ స్కూల్ కరస్పాండెంట్. వారం రోజుల తర్వాత స్కూల్ నుంచి ఇంటికి కారులో తిరిగి వెళ్తున్నాడు. తనతో పాటు రూ.22 లక్షలు కూడా తీసుకెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ఆ కారును ఆపాడు.. మీ కారు బానెట్ నుంచి ఏదో లీక్ అవుతోందని చెప్పాడు...

కారు నుంచి ఏదో లీక్ అవుతోందని ఆపిన దుండగడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే..

అతను ఓ స్కూల్ కరస్పాండెంట్. వారం రోజుల తర్వాత స్కూల్ నుంచి ఇంటికి కారులో తిరిగి వెళ్తున్నాడు.  తనతో పాటు రూ.22 లక్షలు కూడా తీసుకెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ఆ కారును ఆపాడు.. మీ కారు బానెట్ నుంచి ఏదో లీక్ అవుతోందని చెప్పాడు.. దాంతో అతను కారు ఆపి బానెట్ తెరిచి చూశాడు. ఏమీ కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి కూర్చున్నాడు. అయితే కారులో ఉండాల్సిన డబ్బుల బ్యాగ్ లేకపోవడం చూసి షాకయ్యాడు.


వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని జాముయ్ జిల్లాకు చెందిన గౌతమ్ కుమార్ అనే వ్యక్తి దేవ్‌ఘడ్‌లో ఓ స్కూల్ నడుపుతున్నాడు. పిల్లల నుంచి 3 నెలల ఫీజు వసూలు చేసి ఆ డబ్బులను కారులో పెట్టుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి కారు ఆపాడు. కారు బానెట్ నుంచి ఏదో కారుతోంది, సరి చూసుకోమని చెప్పాడు. దీంతో గౌతమ్ కారు దిగి బానెట్ ఓపెన్ చేసి చూశాడు. లోపల సమస్య ఏమీ లేకపోవడంతో తిరిగి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. 


అయితే తన కారులో ఉండాల్సిన రూ.22 లక్షలు లేకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. డబ్బులు దొంగతనం చేసేందుకు ఎవరో తనను ట్రాప్ చేసినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  స్థానిక పోలీసు అధికారి  మాట్లాడుతూ.. "ఇదే తరహాలో ఇటీవల మరికొన్ని దొంగతనాలు జరిగినట్లు ఫిర్యాదులందాయి. ఒక దొంగల ముఠా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నట్లు అనుమానం ఉంది. ప్రస్తుతం సీసీటీవి వీడియోలను పరిశీలిస్తున్నాం" అని అన్నారు.


Read more