Viral News: ప్రభుత్వ నిర్ణయంతో ఎగిరిగంతేసి మరీ.. తన రెండు చెవులనూ తొలగించుకున్నాడు

ABN , First Publish Date - 2022-04-14T21:44:52+05:30 IST

అతడు మనిషిగా జన్మించించాడు. కానీ మనిషిలా బతకడం అతడికి అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో శస్త్రచికిత్సల ద్వారా పూర్తిగా రాక్షసుడి రూపంలో ఉన్న మనిషిగా మారాడు. తన రూపం పట్ల అతడు ఇంకా బహుశా ఇంకా సంతృప్తి పొందలేదేమో.. తప్పని సరిగా మాస్క్ ధరించాలనే నిబంధనను బ్రెజిల్ ప్రభుత్వం తొలగిం

Viral News: ప్రభుత్వ నిర్ణయంతో ఎగిరిగంతేసి మరీ.. తన రెండు చెవులనూ తొలగించుకున్నాడు

ఇంటర్నెట్ డెస్క్: అతడు మనిషిగా జన్మించించాడు. కానీ మనిషిలా బతకడం అతడికి అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో శస్త్రచికిత్సల ద్వారా పూర్తిగా రాక్షసుడి రూపంలో ఉన్న మనిషిగా మారాడు. తన రూపం పట్ల అతడు ఇంకా బహుశా ఇంకా సంతృప్తి పొందలేదేమో.. తప్పని సరిగా మాస్క్ ధరించాలనే నిబంధనను బ్రెజిల్ ప్రభుత్వం తొలగించగానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా రెండు చెవులను తీయించుకుని ఇంకా జుగుప్సాకరంగా మారాడు. అంతేకాకండా అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇతగాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా విలయతాండం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ మహమ్మారిని వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్న విషయం తెసిలిందే. ఇందులో భాగంగానే బ్రెజిల్ కూడా మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా ఉధృతి కాస్తా తగ్గిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి కాదంటూ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని 45ఏళ్ల మిచెల్ ఫారో ప్రాడో వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే తన రెండు చెవులను తొలగించుకున్నాడు. అంతేకాకుండా చెవులు లేకుండా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 





ఇదిలా ఉంటే.. తనను తాను సైతాన్ అపర భక్తుడిగా అభివర్ణించుకునే మిచెల్.. ఇప్పటికే 60కిపైగా సర్జరీలు చేయించుకుని నరరూప రాక్షసుడిగా తయారయ్యాడు. పళ్లను పదునుగా చెక్కించుకోవడంతోపాటు తలపై రెండు కొమ్ములను కూడా అప్పట్లో ఇంప్లాంట్ చేయించుకున్నాడు. 85 శాతం శరీరాన్ని పచ్చబొట్లతో నింపేసుకున్నాడు. వీటికి తోడు ముక్కును, చేతుల్లోని రెండు వేళ్లను తొలగించుకున్నాడు. చివరకు నాలుకను కూడా రెండు భాగాలుగా కత్తిరించుకున్నాడు. 


Updated Date - 2022-04-14T21:44:52+05:30 IST