Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 27 May 2022 03:47:58 IST

జైలు నుంచి విడుదలై వచ్చిన యువకుడు.. ప్రేయసి మరొకరితో తిరగడం చూసి.. ఆవేశంలో కత్తి తీసుకొని..

twitter-iconwatsapp-iconfb-icon
జైలు నుంచి విడుదలై వచ్చిన యువకుడు.. ప్రేయసి మరొకరితో తిరగడం చూసి.. ఆవేశంలో కత్తి తీసుకొని..

వారిద్దరూ ప్రేమించుకున్నారు. అనుకోకుండా ఆ యువకుడిని ఒక దొంగతనం కేసులో పోలీసులు పట్టుకున్నారు. దీంతో అతడు జైలుకు వెళ్లాడు. కొన్ని నెలల తరువాత అతను జైలు నుంచి బయటికి వచ్చాడు. ఆ సమయంలో అతని ప్రియురాలు మరొక యువకుడితో తిరుగుతుండడం చూసి అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను ఒంటరిగా ఉన్న సమయంలో పట్టుకొని కొట్టాడు. తరువాత ఆమెచెప్పిన మాటలు విని అతనికి ఇంకా కోపం వచ్చింది. దీంతో అతను ఒక సర్జికల్ నైఫ్(ఆస్పత్రిలో ఆపరేషన్ చేసేందుకు ఉపయోగించే కత్తి)తో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో నివసించే షీలా(23) అదే ప్రాంతానికి చెందిన వికాస్(27) అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ఒక బైక్ దొంగతనం కేసులో వికాస్‌ని పోలీసులు పట్టుకున్నారు. కోర్టు అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తిచేసుకొని బయటికి వచ్చిన వికాస్.. తన ప్రేయసి షీలాని కలవడానికి వెళ్లాడు. కానీ ఆమె మరొక యువకుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం చూశాడు. దీంతో వికాస్‌కి కోపం వచ్చింది. వెంటనే షీలాను కలిసి నిలదీశాడు. అప్పుడు ఆమె తన తండ్రి గురించి చెప్పింది.


వికాస్ జైలు కెళ్లడంతో అతనితో సంబంధం పెట్టుకోకూడదని షీలా తండ్రి ఆమెతో చెప్పారు. పైగా షీలా కోసం మరో సంబంధం కూడా నిశ్చయం అయింది. ఇప్పుడు షీలా తనకు కాబోయే భర్తతో తిరుగుతోంది. ఇదంతా షీలా.. వికాస్‌కు చెప్పింది. షీలా చెప్పింది విని వికాస్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను రోడ్డు మీదే చితకబాదాడు. అంతటి ఆగక.. ఆ రోజు సాయంత్రం షీలా ఇంటికి వెళ్లి ఆమెపై ఒక సర్జికల్ కత్తితో దాడి చేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో షీలా తల్లి కూడా అక్కడే ఉంది. 


షీలాను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. షీలా తల్లి ఇచ్చిన ఫిర్యదు మేరకు పోలీసులు వికాస్‌ని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసుల ప్రత్యక బృందం అతడి కోసం గాలించి.. చివరికి పట్టుకుంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.