Train Hijack అంటూ ఓ వ్యక్తి ట్వీట్.. వెంటనే స్పందించిన రైల్వే శాఖ!

ABN , First Publish Date - 2022-07-11T23:42:39+05:30 IST

ఆ వ్యక్తి కర్ణాటక-ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు.. కొద్ది దూరం వెళ్లాక ఆ రైలు దారి మారినట్టు గుర్తించాడు.

Train Hijack అంటూ ఓ వ్యక్తి ట్వీట్.. వెంటనే స్పందించిన రైల్వే శాఖ!

ఆ వ్యక్తి కర్ణాటక-ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు.. కొద్ది దూరం వెళ్లాక ఆ రైలు దారి మారినట్టు గుర్తించాడు.. తప్పుడు మార్గంలో వెళ్తోందని భావించి వెంటనే ట్విటర్ ద్వారా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు.. ట్రైన్ హైజాక్ అయిందని, తనకు సహాయం చేయాలని కోరూతూ IRCTC, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎమ్)ని ట్యాగ్ చేశాడు.


కృష్ణ బెహెరా అనే ప్రయాణికుడు కర్ణాటక-ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. రైలు మజ్రీ జంక్షన్, సీతాఫల్ మండి మధ్య దారి మళ్లడాన్ని గమనించాడు. దీంతో భయాందోళనకు గురైన అతను వెంటనే ఓ ట్వీట్‌ చేశాడు. `డియర్ @IRCTCofficial @drmsecunderabad.. రైలు నెం-12650 హైజాక్ అయింది. దయచేసి సహాయం చేయండి!` అని ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన రైల్వే శాఖ.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)ని అప్రమత్తం చేసింది. 


కొంత సమయం తర్వాత ఆర్పీఎఫ్ స్పందిస్తూ ట్రైన్‌ను ఎవరూ హైజాక్ చేయలేదని సమాధానం ఇచ్చింది. `రైలు హైజాక్ అవలేదు. ట్రాక్ పనుల కారణంగా దారి మళ్లించారు. భయపడకండి` అని ఆర్పీఎఫ్ నుంచి సమాధానం వచ్చింది. కాజీపేట, బల్రాషా మధ్య ట్రాక్ మరమ్మత్తులు జరుగుతున్న కారణంగా రైలును హైదరాబాద్ డివిజన్ మీదుగా మళ్లించినట్టు తెలిపింది.



Updated Date - 2022-07-11T23:42:39+05:30 IST