Viral: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఇంకొద్ది క్షణాల్లో బాలుడు లారీ కింద పడిపోయేవాడే.. తృటిలో తప్పిన ప్రమాదం...!

ABN , First Publish Date - 2022-02-22T23:40:12+05:30 IST

తెలిసీ తెలియని వయసులో చిన్నారులు ప్రమాదాలకు ఎదురెళ్లే అవకాశం ఎక్కువ! అందుకే.. పిల్లలపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలంటారు పెద్దలు. అయితే.. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral:  ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఇంకొద్ది క్షణాల్లో బాలుడు లారీ కింద పడిపోయేవాడే.. తృటిలో తప్పిన ప్రమాదం...!

ఇంటర్నెట్ డెస్క్:  తెలిసీ తెలియని వయసులో  చిన్నారులు ప్రమాదాలకు ఎదురెళ్లే అవకాశం ఎక్కువ! అందుకే..  పిల్లలపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలంటారు పెద్దలు. అయితే.. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పే ఘటన ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీసింది.  ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. అదృష్టం బాగుండి.. ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ బాలుడిని ప్రాణాపాయం నుంచి బయటపడేసిన వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆన్‌లైన్ చర్చా వేదిక ‘రెడ్డిట్’‌లో ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది.  


వివరాలు.. రహదారి పక్కనే ఆడుకుంటున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో బాలుడి వైపుగా ఓ లారీ దూసుకువచ్చింది. అయితే.. అక్కడే ఉన్న మరో వ్యక్తి జరగబోయే ప్రమాదాన్ని  క్షణకాలంలో పసిగట్టి, బాబు వెనకాలే పరుగు తీశాడు. మరి కొద్ది క్షణాల్లో ఆ చిన్నారిని లారీ ఢీకొంటుందనగా.. అతడిని వెనక్కు లాగి రక్షించాడు. దీంతో సదరు వ్యక్తిని నెటిజన్లు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 

Updated Date - 2022-02-22T23:40:12+05:30 IST