వాంకోవర్: తన భార్యకు కొవిడ్-19 టీకాను వేసినందుకు ఒక వ్యక్తి నర్సు ముఖం మీద పిడిగుద్దులు గుప్పించిన సంఘటన కెనడాలోని క్యూబెక్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఆ వ్యక్తి తన అనుమతి లేకుండా భార్యకు వ్యాక్సిన్ ఏలా వేస్తారని ఫార్మసీకి వెళ్లి నర్సు ముఖం మీద కొట్టారని పోలీసులు తెలిపారు. నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రజలు సహాయం చేయాలన్నారు. ఒత్తైన నల్లటి జుట్టు, దట్టమైన కనుబొమ్మలు, చేతి మీద శిలువ గుర్తు వంటి పోలికలతో ఆ వ్యక్తి ఉంటాడని చెప్పారు.
కెనడాలో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా పాఠశాలలు, ఆసుపత్రులు సమీపంలో నిరసనకారులు ప్రదర్శనలు చేస్తు ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడా ప్రభుత్వం ‘‘ హోల్డ్ అండ్ సెక్యూర్’’ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేస్తుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ ప్రదర్శనలను ఆపడానికి తమ ప్రభుత్వం గురువారం లోగా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తుందని క్యూబెక్ మేయర్ ఫ్రాంకోయిస్ లెగాల్ట్ వివరించారు.