బస్టాప్‌లో అందరూ బస్ కోసం వేచి చూస్తున్నారు.. అక్కడకు టిప్‌టాప్‌గా రెడీ అయి ఓ యువకుడు వచ్చాడు.. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నారు.. అయితే అతడు అక్కడున్న అందరికీ షాకిచ్చాడు.. `వ్యాక్సిన్.. వ్యాక్సిన్ కోసం రండి భాయ్.. మొదటి డోస్.. సింగిల్ డోస్` అంటూ అరవడం ప్రారంభించాడు.. మొదట బిత్తరపోయిన జనం తర్వాత నవ్వడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బస్టాప్‌నకు వచ్చిన ఓ వ్యక్తి కూరగాయలు అమ్మే వ్యక్తి తరహాలో `వ్యాక్సిన్` గురించి ప్రమోషన్ చేపట్టాడు. `వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. అందరూ తీసుకోవాలి.. త్వరపడండి.. మీ జీవితాన్ని కాపాడుకోండి` అంటూ నడిరోడ్డుపై అరవడం ప్రారంభించాడు. అక్కడున్న వారు ఆ దృశ్యాన్ని కెమేరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో 25 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. `వ్యాక్సిన్ వాలా` అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.