Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 27 Mar 2022 20:26:01 IST

భర్త మెసేజ్ చేయడంతో న్యూడ్ ఫొటోలు పంపిన భార్య.. కొన్నాళ్లకు అనుమానం వచ్చి ఆరాతీయగా..

twitter-iconwatsapp-iconfb-icon
భర్త మెసేజ్ చేయడంతో న్యూడ్ ఫొటోలు పంపిన భార్య.. కొన్నాళ్లకు అనుమానం వచ్చి ఆరాతీయగా..ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు.. కాసేపటికి సద్దుమణుగుతుంటాయి. కొందరు దంపతులు ఇంట్లో ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు అర్థం చేసుకోకపోవడంతోనే సమస్యలు తలెత్తుతుంటాయి. ముంబైలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. న్యూడ్ ఫొటోలు పంపమని భర్త నుంచి మెసేజ్ రావడంతో క్షణం ఆలోచించకుండా పంపించింది భార్య. ఇలా కొన్నాళ్లకు మరిన్ని ఫొటోలు పంపమని మెసేజ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి భర్తను ప్రశ్నించగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

ముంబైలోని మలాడ్ దిన్‌దోషి అనే ప్రాంత పరిధిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త ఆఫీసు పని మీద పొద్దున వెళ్లి రాత్రికి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం భార్యకు తన భర్త ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది. ‘‘ నీ న్యూడ్ ఫొటో పంపు’’.. అని మెసేజ్ రావడంతో, భర్తే కదా అని వెంటనే పంపించింది. కొన్నాళ్లకు మళ్లీ భర్త నుంచి.. ‘‘మరికొన్ని న్యూడ్ ఫొటోలు పంపు’’.. అని మెసేజ్ వచ్చింది. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఫొటోలను అందరికీ షేర్ చేస్తా అని బెదిరించాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్తతో ఈ విషయంపై గొడవ పడింది. దీనికి భర్త.. ‘‘ అసలు నాకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతానే లేదు’’.. అని చెప్పాడు. దీంతో భార్య అవాక్కై.. జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. తర్వాత ఇద్దరూ కలిసి మార్చి 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. పట్టుకొస్తానంటూ వెళ్లాడు.. తర్వాత స్నేహితుడితో కలిసి వచ్చి..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇన్‌స్టాగ్రామ్‌ ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేశారు. దంపతులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చెందిన 20ఏళ్ల యువకుడి ఖాతా నుంచి మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసింది. గత నవరాత్రుల సమయంలో బాధిత కుటుంబానికి, యువకుడి కుటుంబానికి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి మహిళ మీద కోపం పెంచుకున్న యువకుడు.. ఎలాగైనా అవమానించాలని కుట్ర పన్నాడు. దీంతోనే బాధిత మహిళ భర్త పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఇంత దారుణానికి ఒడిగట్టాడని తేలింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎంతసేపు టీవీ చూస్తావ్! బయటికి రా.. అంటూ పిలిచిన భార్య.. ఎంతసేపటికీ రాలేదని ఇంట్లోకి వెళ్లి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న తల్లీకొడుకును అడ్డుకున్న వ్యక్తులు.. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి.. చివరకు..అన్నాదమ్ములిద్దరికీ పెళ్లి ఫిక్స్.. పెళ్లి రోజు బంధువులతో సహా వధువుల ఇంటికి.. తీరా అక్కడ సీన్ చూసి..‘‘మీ నాన్న నాకు చాలా క్లోజ్’’.. అంటూ పరిచయం చేసుకున్నాడు.. పనుందంటూ బాలికను పాఠశాల వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి..ఆడుకుని వస్తానంటూ వెళ్లి.. ఇంటికి రాని విద్యార్థి, అదే రోజు టీచర్ కూడా అదృశ్యం.. ఆరాతీయగా చివరికి తెలిసింది ఏంటంటే..సెకండ్ షోకు వెళ్లిన వైద్యురాలు, ఆమె స్నేహితుడు.. అర్ధరాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటో ఎక్కడంతో..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.