ఒంటికి నిప్పంటించుకొని గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజల్.. నెట్టింట వైరల్!

ABN , First Publish Date - 2020-08-13T00:29:46+05:30 IST

మనసు మంచిదైతే మనం చేసే పనులన్నీ అద్భుతాలుగానే కనబడతాయి.

ఒంటికి నిప్పంటించుకొని గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజల్.. నెట్టింట వైరల్!

లండన్: మనసు మంచిదైతే మనం చేసే పనులన్నీ అద్భుతాలుగానే కనబడతాయి. మనసులోని భావం అందమైనది అయితే చేసే వింత పనులు కూడా ఆ అందాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ మాటను తన చేతల్లో చూపించాడో స్టంట్‌మెన్. యూకేకు చెందిన కిరీ ఆష్ అనే 52ఏళ్ల వ్యక్తి సినిమాల్లో స్టంట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తన 48ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ కత్రినా డాబ్సన్‌కు వినూత్నంగా ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడతను. అయితే ఎలా చేయాలో తెలియలేదు. చివరకు తనకు వచ్చిన స్టంట్‌మెన్ విద్యనే ప్రేమను చెప్పడానికి ఉపయోగించాలని డిసైడైపోయాడు. ఆమెను పిలిచి ఒంటికి నిప్పంటించుకొని మంటలు ఎగసిపడుతుండగా తన ప్రేమను చెప్పి, పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీంతో కత్రినా ఎంత షాక్‌కు గురైందంటే ఆమె నోటివెంట కనీసం ‘యస్’ అనే మాటకూడా రాలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రికీ.. ‘నాకైతే ఇది ఓ భారీ హాలీవుడ్ సినిమాకు పనిచేస్తూ, నా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేస్తున్నట్లు అనిపించింది. ఆమె కూడా నేను చేసిన పనికి బాగా షాకైంది’ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ‘మ్యాన్ ఆన్ ఫైర్’ ప్రపోజల్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2020-08-13T00:29:46+05:30 IST