ఆఫీసులోనే మకాం పెట్టిన ఉద్యోగి.. జీతం సరిపోవట్లేదంటూ.. కంపెనీకి విషయం తెలియడంతో చివరికి జరిగింది ఇదీ..

ABN , First Publish Date - 2022-03-16T03:03:58+05:30 IST

తమ సంస్థలు ఇచ్చే జీతాలు సరిపోక నానా అవస్థలు పడే చిరు ఉద్యోగుల ఉదంతాలు నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ విషయమై అనేక దేశాల్లో ఉద్యోమాలు నడిచాయి కూడా. తమ అవస్థలను ఎంతో మంది వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ పరిస్తితుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే..

ఆఫీసులోనే మకాం పెట్టిన ఉద్యోగి.. జీతం సరిపోవట్లేదంటూ.. కంపెనీకి విషయం తెలియడంతో చివరికి జరిగింది ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్:  తమ సంస్థలు ఇచ్చే జీతాలు సరిపోక నానా అవస్థలు పడే చిరు ఉద్యోగుల ఉదంతాలు నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ విషయమై అనేక దేశాల్లో ఉద్యోమాలు నడిచాయి కూడా. తమ అవస్థలను ఎంతో మంది వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ పరిస్తితుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. అమెరికాకు చెందిన ఓ ఉద్యోగి తనకు జీతం సరిపోవట్లేదని చెబుతూ..  ఎవ్వరూ ఊహించని పని చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలో టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి..చివరికి ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. ఇంతకీ అతడు చేసిందేంటంటే.. తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి ఆఫీసుకే  మకాం మార్చేయడం! తక్కువ జీతం ఇస్తున్న సంస్థ తీరు పట్ల నిరసనగా ఈ పనికి దిగాడు. అంతేకాకుండా.. అక్కడ తన లైఫ్ ఎలా ఉంటోందనే విషయాన్ని వీడియోలు తీసి టిక్‌టాక్ ద్వారా షేర్ చేశాడు. 


ఈ ఐడియా చాలా కొత్తగా ఉండటంతో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి పడ్డారు.  దీంతో.. సహజంగానే ఈ మేటర్ అంతా యాజమాన్యం దృష్టికి వెళ్లింది. తక్షణం ఈ పనులన్నీ కట్టిపెట్టాలంటూ వారు అతడికి తేల్చి చెప్పారు. మునుపటి వీడియోలన్నీ డిలీట్ చేయాలని కూడా స్పష్టం చేశారు. ఈ విషయాలన్ని అతడు టిక్‌టాక్‌లో పంచుకున్నాడు. అయితే.. తన ఉద్యోగం దాదాపుగా పోయినట్టే అని అన్నాడు. ఇలాంటి వినూత్న నిరసన తెలిపిన ఆ వ్యక్తి పేరు సైమన్! అది కరోనా సమయం కావడంతో ఇతర ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటికే పరిమితమైపోయారు. దీంతో.. అతడు ఆఫీసులో మకాం పెట్టినా ఇబ్బంది కలుగలేదు. 

Updated Date - 2022-03-16T03:03:58+05:30 IST