Thane:కొవిడ్ టీకా బదులు రాబీస్ వ్యాక్సిన్...నర్సు నిర్వాకం

ABN , First Publish Date - 2021-09-29T12:45:11+05:30 IST

ఓ నర్సు కొవిడ్ టీకా బదులు పొరపాటున రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఉదంతం...

Thane:కొవిడ్ టీకా బదులు రాబీస్ వ్యాక్సిన్...నర్సు నిర్వాకం

నర్సు సస్పెన్షన్...దర్యాప్తునకు ఆదేశం

థానే (మహారాష్ట్ర): ఓ నర్సు కొవిడ్ టీకా బదులు పొరపాటున రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఉదంతం మహారాష్ట్రలోని థానే ఆరోగ్యకేంద్రంలో వెలుగుచూసింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనూర్స్ ఆరోగ్యకేంద్రానికి కొవిడ్ టీకా వేయించుకునేందుకు రాజ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వచ్చాడు. కొవిడ్ టీకా కోసం వచ్చిన యాదవ్ కు నర్సు కీర్తి పోపెరె పొరపాటున రాబీస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ చేశారు. రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చిన యాదవ్ ను ఆరోగ్య కేంద్రంలో వైద్యుల పరిశీలనలో ఉంచారు. నర్సు టీకా వేసే ముందు అతని వద్ద ఉన్న పేపరు చూడకుండా కొవిడ్ బదులు రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ అధికారులు నర్సు కీర్తిని సస్పెండ్ చేశారు. కొవిడ్ బదులు రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు వ్యవహారంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-09-29T12:45:11+05:30 IST