వామ్మో.. వట్టి చేతులతోనే దోసెలేస్తున్నాడే..!

ABN , First Publish Date - 2021-10-23T07:14:46+05:30 IST

స్ట్రీట్ ఫుడ్ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. అలాంటి స్ట్రీట్ ఫుడ్ షాపులకు గిరాకీ భలే ఉంటుంది. దీనికి తోడు ఒకవేళ ఈ షాపుల్లో..

వామ్మో.. వట్టి చేతులతోనే దోసెలేస్తున్నాడే..!

స్ట్రీట్ ఫుడ్ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. అలాంటి స్ట్రీట్ ఫుడ్ షాపులకు గిరాకీ భలే ఉంటుంది. దీనికి తోడు ఒకవేళ ఈ షాపుల్లో ఎవరైనా వంటమాస్టర్లు వెరైటీగా వంట చేస్తే మాత్రం.. ఇక ఆ షాప్‌ పాపులారిటీ అమాంతం పెరిగిపోతుంది. అలాంటి ఓ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంది. ఈ షాప్‌లో ఓ దోశ మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ అలాంటి ఇలాంటి వాడు కాదు.. పొయ్యి మీద బాగా కాలి.. సెగలు కక్కుతున్న పెనం మీద వట్టి చేతులతో దోసెలు వేసేస్తాడు. ఈ వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.


వేడి వేడి పెనంపై ఆ మాస్టర్ దోసెలు వేస్తున్న వీడియోను ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహీ తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఆ మాస్టర్.. దోశ పిండిని వట్టి చేతులతోనే పెనంపై వేసి రుద్దేశాడు. ఆ తర్వాత దానిపై క్యారట్, క్యాప్సికం, బీట్‌రూట్ వంటివన్నీ వేసి అదిమాడు ఆ తర్వాత చేతులతోనే ఆ దోశను తిరగేసి చక్కగా తీసి పక్కన పెట్టాడు. అమర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో.. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం 4 రోజుల్లోనే ఈ వీడియోకు 1.6 మిలియన్ల వ్యూస్, 46వేలకు పైగా లైక్స్ వచ్చాయి.



Updated Date - 2021-10-23T07:14:46+05:30 IST