తను ప్రమాదంలో ఉన్నానంటూ.. అర్ధరాత్రి వీడియో కాల్ చేసి సోదరితో ప్రాంక్ చేసిన యువకుడు.. వీడియో కాల్‌లో ఆమె చూస్తుండగానే ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-21T05:47:41+05:30 IST

అతను అయిదుగురు అక్కల ముద్దుల తమ్ముడు. జీవితాన్ని ఎప్పుడూ సరదా గడుపుతూ అందరినీ నవ్వించేవాడు. అలాంటి యువకుడు ఒకరోజు అర్ధరాత్రి వేళ తన అక్కకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకోబోయాడు...

తను ప్రమాదంలో ఉన్నానంటూ.. అర్ధరాత్రి వీడియో కాల్ చేసి సోదరితో ప్రాంక్ చేసిన యువకుడు..  వీడియో కాల్‌లో ఆమె చూస్తుండగానే ఏం జరిగిందంటే..

అతను అయిదుగురు అక్కల ముద్దుల తమ్ముడు. జీవితాన్ని ఎప్పుడూ సరదా గడుపుతూ అందరినీ నవ్వించేవాడు. అలాంటి యువకుడు ఒకరోజు అర్ధరాత్రి వేళ తన అక్కకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకోబోయాడు. కానీ అదంతా ప్రాంక్(సరదా కోసం) అని తెలిసిన మరుక్షణమే.. మరో ఘోరం జరిగిపోయింది. 


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జష్‌పూర్ నగరంలో నివసించే రిజ్వాన్ ఖాన్(22)కు అయిదుగురు అక్కలున్నారు. అందరూ వివాహం తరువాత వారి.. వారి అత్తవారింట్లో ఉంటున్నారు. అమ్మనాన్న.. లేకపోవడంతో రిజ్వాన్ ఒంటరిగా ఉండేవాడు. రిజ్వాన్ జవితాన్ని ఎప్పుడూ సరదాగా గడిపేవాడు. తన అక్కలను కూడా 


సరదాకోసం ఆటపట్టించేవాడు. అలా.. ఒకరోజు అర్ధరాత్రి వేళ రిజ్వాన్ తన అక్కకు వీడియో కాల్ చేశాడు. అవతల రిజ్వాన్ అక్క ఫోన్ రిసీవ్ చేయగానే.. ఆమెకు ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది.


రిజ్వాన్ తన ఇంట్లో చీరను తన మెడకు చుట్టి ఉరి వేసుకోబోతున్నాడు. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని చూసి ఆమె భయపడిపోయింది. రిజ్వాన్‌కు ఏం కష్టమొచ్చిందో.. తనకు చెప్పమని.. ఆమ్మహత్య చేసుకోవద్దని ఆమె తన తమ్ముడిని ప్రాధేయపడింది. ఇంతలో రిజ్వాన్ గట్టిగా నవ్వాడు. ఇదంతా తనను ఆటపట్టించడానికి చేసిన ప్రాంక అని చెప్పాడు. ఆ తరువాత రిజ్వాన్ అక్క కాస్త ఊపిరి పీల్చుకొని.. ఇంకోసారి ఇలాంటివి చేయొద్దని అతడిని మందలించింది. దానికి రిజ్వాన్, తను కేవలం ఉరివేసుకుంటే ఎలా ఉంటుందో.. చూద్దామని అలా చేశానని చెబుతూ ఆమెకు వివరించడం మొదలుపెట్టాడు.  ఈ క్రమంలో మరోసారి చీరను తన మెడకు బిగించుకొని కుర్చీ మీదకు ఎక్కాడు. అలా మాట్లాడుతుండగా.. అతని కాళ్ల కింద నుంచి కుర్చీ జారిపోయింది. రిజ్వాన్ ఊపిరాడక.. కొట్టుమిట్టాడుతున్నాడు.


ఇదంతా అతని అక్క వీడియో కాల్ ద్వారా లైవ్‌‌లో చూస్తోంది. ముందు ఆమె రిజ్వాన్ మరోసారి ప్రాంక్ చేస్తున్నాడని భావించింది. కానీ.. అతను ఊపిరాడక ఇబ్బంది పడడం గమనించి.. పక్కింటి వారికి ఫోన్ చేసింది. పక్కింటి వారు రిజ్వాన్ ఉన్న ఇంట్లోకి వచ్చేసరికి అతను మరణించాడు. ఆ తరువాత పోలీసులు ఘటనా స్థలం చేరుకొని దర్యాప్తు చేశారు.


రిజ్వాన్ మృతదేహం వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభించలేదు. వీడియో కాల్ ద్వారా రిజ్వాన్ మరణాన్ని చూసిన అతని సోదరినే ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-02-21T05:47:41+05:30 IST