ట్రాన్స్ జెండర్‌ని ప్రేమించిన యువకుడు.. మరో యువకుడితోనూ ఆ ట్రాన్స్‌జెండర్ యువతి ప్రేమ వ్యవహారం.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-09T05:50:56+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు నాలుగేళ్లు కలిసి తిరిగారు. వివాహం కూడా చేసుకుందామనుకున్నారు. కానీ వారిద్దరిలో ఒకరు పురుషుడు కాగా.. మరొకరు ట్రాన్స్ జెండర్ యువతి(అమ్మాయిగా మారిన పురుషుడు). కొంతకాలం తరువాత వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో...

ట్రాన్స్ జెండర్‌ని ప్రేమించిన యువకుడు.. మరో యువకుడితోనూ ఆ ట్రాన్స్‌జెండర్ యువతి ప్రేమ వ్యవహారం.. చివరికి ఏం జరిగిందంటే..

వారిద్దరూ ప్రేమికులు నాలుగేళ్లు కలిసి తిరిగారు. వివాహం కూడా చేసుకుందామనుకున్నారు. కానీ వారిద్దరిలో ఒకరు పురుషుడు కాగా.. మరొకరు ట్రాన్స్ జెండర్ యువతి(అమ్మాయిగా మారిన పురుషుడు). కొంతకాలం తరువాత వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోయారు. తర్వాత ఆమె మరో యువకుడి ప్రేమలో పడింది. అతడితో కలిసి తిరగడం ప్రారంభించింది. దీంతో ఆమెపై పాత ప్రియుడు పగ పెంచుకున్నాడు. ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు.


బీహార్‌లోని బెట్టియాలో నివసిస్తున్న గుడ్డూ అన్సారీ అనే వ్యక్తి షబానా అనే ట్రాన్స్‌జెండర్ యువతితో నాలుగేళ్లు ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే గుడ్డూ ప్రవర్తనతో విసుగు చెందిన షబానా అతడికి రెండేళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసింది. అతడు తరచుగా డిస్ట్రబ్ చేస్తున్నా అతడితో మాటలు కలపలేదు. ఏడాది క్రితం సద్దాం అనే యువకుడికి దగ్గరైంది. ఇద్దరూ కలిసి తిరిగేవారు. 


ఈ విషయం తెలుసుకున్న గుడ్డూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను నిర్లక్ష్యం చేసిన షబానాకు బుద్ధి చెప్పాలకున్నాడు. సోమవారం సాయంత్రం షబానా, సద్దాం రోడ్డు పక్కన పానీ పూరి తింటుండగా వారిపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో షబానా, సద్దాం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే కాల్పులు జరిపిన గుడ్డూ పారిపోతూ పోలీసులకు చిక్కాడు. 

Updated Date - 2022-03-09T05:50:56+05:30 IST