6 ఏళ్ల క్రితం ఊడిపోయిన అంగం.. చేతిపై అమర్చిన డాక్టర్లు!

ABN , First Publish Date - 2020-08-02T23:00:47+05:30 IST

పురుషాంగం ఎక్కడ ఉంటుంది...ఆగండాగండి.. కొప్పడకండి.. ఇలాంటి ప్రశ్నకు వేసుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఆ కారణం..ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనకు ముందుగా మాల్కమ్ మెక్‌డోనాల్డ్ గురించి తెలియాలి.

6 ఏళ్ల క్రితం ఊడిపోయిన అంగం.. చేతిపై అమర్చిన డాక్టర్లు!

నార్‌ఫోక్(ఇంగ్లండ్): మాల్కమ్ మెక్‌డోనల్డ్..ప్రపంచ వైద్య చరిత్రలో ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. అందరిలా కాకుండా.. చేతిపై పురుషాంగం ఉండటమే అతడి ప్రత్యేకత. అందేంటి.. అదెలా సాధ్యం అంటారా.. అయితే ఈ కథనం మీకోసమే..


మాల్కమ్ మెక్‌డోనాల్డ్ ఓ విధి వంచితుడు. ఇంగ్లండ్‌లోని నార్‌ఫోక్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అతడికి పిల్లలు కూడా ఉన్నారు.  సుమారు ఆరేళ్ల క్రితం.. అంటే.. 2014లో అతడి జీవితంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షణ్ కారణంగా అతడి పురుషాంగం పూర్తిగా నల్లబడిపోయింది. చికిత్స తీసుకుంటుండగానే  ఓ రోజు ఉన్నట్టుంది అతడి అంగం ప్యాంటు లోంచి జారి కింద పడిపోయింది.


ఇక అప్పటి నుంచి మాల్కమ్ పూర్తిగా మారిపోయాడు. మగతనం కోల్పోయినందుకు అతడు నలుగురిలోకి వెళ్లలేకపోయాడు. స్నేహితులు, కుటుంబసభ్యులు అందరినీ దూరం పెట్టేశాడు. ఒంటరి జీవితం..నిరంతరం మద్యంతో సావాసం..దీంతో మాల్కమ్ జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 


ఇంతలో మరో ఊహించని మలుపు. మాల్క్‌మ్ బాధను గుర్తించిన అతడి ఫ్యామిటీ డాక్టర్.. ప్రొఫెసర్ డేవిడ్ రాల్ఫ్ పేరును సూచించాడు. దీనికి రాల్ఫే పరిష్కారం చెప్పగలరన్నాడు. జీవితం ఇక ఇంతే అనుకుంటున్న తరుణంలో మాల్కమ్‌కు రాల్ఫ్ ఓ దేవుడిలా కనిపించాడు. రాల్ఫ్ డెర్మటారలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్. లండన్‌లోని యూనివర్శిటీ కాలేజీ హాస్పటల్‌లో విధులు ఆయన నిర్వహిస్తుంటారు. ఇక మాల్కమ్ పరిస్థితి గురించి తెలిసిన రాల్ఫ్  వెను వెంటనే బాధితుడికి ఓ పరిష్కారం చూపించారు. అదే కొత్తగా పురుషాంగం!


చేతిపై ఉన్న చర్మంతో కొత్త అంగం రూపొందించడం సాధ్యమే అని రాల్ఫ్ మాల్కమ్‌కు చెప్పారు. ఆ తరువాత.. మాల్కమ్ ఏడమచేతిపై దీన్ని ఏర్పాటు చేశారు కూడా. ముందుగా మాల్కమ్ శరీరంలో నుంచి కొంత చర్మాని సేకరించి ఓ గొట్టంగా చుట్టచుట్టారు. ఆ తరువాత దాన్ని ఎడమ చేతిమణి కట్టుకు పైభాగంలో అమర్చారు. దానికి రక్తనాళాలను, అంగ స్థంభన కోనం ఉపయోగపడే రెండు గొట్టాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా..మాల్కమ్ కీరిక మేరకు కొత్త అంగం సైజు రెండు అంగుళాల మేర పెంచారు.  కొన్ని సంవత్సరాలు చేతిపై అలాగే దాన్ని ఉండనిస్తే.. సహజసిద్ధ అంగానికున్న లక్షణాలన్నీ ఇది సంతరించుకుంటుందని రాల్ఫ్ చెప్పారు.


ప్రస్తుతం మాల్కమ్ అంగం చేతి నుంచి అలాగే వేలాడుతోంది. మరో శస్త్రచికిత్సతో ద్వారా దాన్ని యథాస్థానానికి తీసికెళ్లాలనేది డాక్టర్ల ప్లాన్. 2018లో చివరి శస్త్రచికిత్స జరగాల్సి ఉన్నా మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చిపడ్డాయి. కరోనా సంక్షోభం కూడా ఆలస్యానికి కారణమైంది. దీంతో అనుకున్న ప్రకారం ఆ శస్త్రచికిత్స జరగలేదు. ఈలోపు చేతి నుంచి వేల్లాడుతున్న దీన్ని ఇతరులకు కనబడకుండా ఉండేందుకు మాల్కమ్ ఎప్పుడూ పొడుగు చేతులున్న షర్టులనే ధరిస్తాడు.


అయినా అప్పుడప్పు ఎవరోకరు చేతిపై ఉన్నదేంటో గుర్తుపట్టేస్తుంటారంటూ తెగ నవ్వుతాడు మాల్కమ్. ఇలా నవ్వుతూ ముందుకు వెళ్లడమే తన ముందున్న ఒకేఒకదారి అని కూడా అతడు అంటాడు. అన్నట్టు..మాల్కమ్ తన చేతిపై ఉన్నదాన్ని ముద్దుగా జిమ్మీ అని కూడా పేరు పెట్టుకున్నాడు. ఈ ఏడాది చివరికల్లా అన్ని అనుకున్నట్టుగా జరిగి తన జిమ్మీ రెండు కాళ్ల మధ్యా చేరిపోవాలని కోరుకుంటున్నాడు మాల్కమ్.


మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వ్యవహారానికయ్యే ఖర్చంతా ప్రభుత్వాధ్వర్యంలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్ భరించింది. ఇటువంటి ప్రక్రియ జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడమనేది ఈ శస్త్రచికిత్సకున్న మరో ప్రత్యేకత. హమ్మయ్యా.. అందండీ.. ఈ టాపిక్ లేవనెత్తడానికి గల కారణం.. ఇంతకుముందు మనం వేసుకున్న ప్రశ్నకు సమాధానం.


Updated Date - 2020-08-02T23:00:47+05:30 IST