ఆన్‌లైన్‌లో రూ.లక్ష ఫోన్ ఆర్డర్ చేశాడు.. ప్యాక్ విప్పి చూసి షాకయ్యాడు.. టాయ్‌లెట్ పేపర్‌లో..

ABN , First Publish Date - 2021-12-27T20:51:58+05:30 IST

ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇళ్లు కదలకుండా కావాల్సినవి కొనేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో రూ.లక్ష ఫోన్ ఆర్డర్ చేశాడు.. ప్యాక్ విప్పి చూసి షాకయ్యాడు.. టాయ్‌లెట్ పేపర్‌లో..

ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇళ్లు కదలకుండా కావాల్సినవి కొనేసుకుంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యవంతంగానే ఉంటున్నప్పటికీ, దాని రిస్కులు దానికి ఉన్నాయి. ఆర్డర్ చేసింది ఒకటైతే.. వచ్చింది మరొకటి అంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతుండడం అప్పడప్పుడు జరుగుతోంది. తాజాగా ఐ ఫోన్-13 ఆర్డర్ చేసిన కస్టమర్‌కు భారీ షాక్ తగిలింది. 


లండన్‌కు చెందిన డానియెల్ కరోల్ అనే వ్యక్తి ఈ నెల 13న ఆపిల్ వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్-13 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఈ నెల 17న అతని ఇంటికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని ఎంతో ఆశగా విప్పి చూసిన డానియెల్‌కు భారీ షాక్ తగిలింది. ప్యాకెట్ లోపల టాయ్‌లెట్ పేపర్‌లో రెండు డెయిరీ మిల్క్ చాక్లెట్ బార్‌లు కనిపించాయి. షాకైన డానియెల్ వెంటనే కొరియర్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ నమోదు చేసుకున్న సంస్థ ప్రతినిధులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-27T20:51:58+05:30 IST