Life Changing Decision: నెలకు 50 వేల జీతాన్నిచ్చే ప్రభుత్వోద్యోగానికి గుడ్ బై చెప్పి వినూత్న ప్రయోగం.. ఇప్పుడు ఏడాదికి రూ.30 లక్షలు..!

ABN , First Publish Date - 2022-08-06T20:44:10+05:30 IST

అతను ప్రభుత్వ ఉద్యోగి.. బీహార్ (Bihar) ఆరోగ్య శాఖలో హెల్త్ ఆఫీసర్‌గా పని చేసేవాడు.

Life Changing Decision: నెలకు 50 వేల జీతాన్నిచ్చే ప్రభుత్వోద్యోగానికి గుడ్ బై చెప్పి వినూత్న ప్రయోగం.. ఇప్పుడు ఏడాదికి రూ.30 లక్షలు..!

అతను ప్రభుత్వ ఉద్యోగి.. బీహార్ (Bihar) ఆరోగ్య శాఖలో హెల్త్ ఆఫీసర్‌గా పని చేసేవాడు.. నెలకు రూ.50 వేలు సంపాదించేవాడు.. అయితే వ్యాపారవేత్తగా రాణించాలనేది అతని చిన్న నాటి కల.. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి తన కల వైపు నడిచాడు.. చేప పిల్లల పంపిణీదారుగా మారి నెలకు ఏకంగా రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఔరంగాబాద్‌కు చెందిన ప్రకాష్ కుమార్ సింగ్ కథ స్థానికంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అతడు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు అవమానించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

Viral Video: ట్రక్‌ను పైకి ఎత్తబోయి బ్రిడ్జి మీద నుంచి పడిపోయిన క్రేన్.. వీడియో వైరల్


నవీనగర్ బ్లాక్‌లోని రాజ్‌పూర్ నివాసి ప్రకాష్ బీహార్ ఆరోగ్య శాఖలో హెల్త్ ఆఫీసర్‌గా పని చేసేవాడు. నెలకు రూ.50 వేలు సంపాదించేవాడు. అయితే వ్యాపారం చేయాలనేది అతడి కోరిక. ఉద్యోగంలో భాగంగా ప్రకాష్ నాలుగేళ్ల క్రితం ఓ డాక్టర్‌ను కలిశాడు. ఆ డాక్టర్ హేచరీ నడుపుతూ చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఆయన నుంచి సమాచారం సేకరించి రూ.30 లక్షల పెట్టుబడి పెట్టి  ప్రకాష్ కూడా హేచరీ ప్రారంభించాడు. ప్రకాష్ హేచరీలో బంగుర్, రూప్ చందా, రోహు, కట్ల, సిల్వర్ కార్ప్ వంటి పలు రకాల జాతుల చేపలు ఉత్పత్తి అవుతాయి.


హేచరీ ప్రారంభించి ప్రకాష్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధిని కల్పించాడు. ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ హేచరీ ద్వారా ప్రకాష్ ఏటా రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. చేపల సంరక్షణను పర్యవేక్షించేందుకు ఒక వైద్యుడిని కూడా నియమించాడు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలతోనూ నిత్యం టచ్‌లో ఉంటానని చెప్పాడు.

Updated Date - 2022-08-06T20:44:10+05:30 IST