Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీ భర్త పది అంతస్తుల భవనంపై నుంచి దూకేశాడు.. అని చెప్పడానికి వెళ్లిన వాచ్‌మన్‌కు గదిలో షాకింగ్ సీన్లు.. అసలేం జరిగిందంటే..

భార్యాభర్తల మధ్య అనుమానం మొదలైతే అది అనర్థాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఆ బంధం నమ్మకం అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. భార్యపై అనుమానంతో ఎన్నో సంసారాలు నాశనమైపోయాయి. కానీ భర్తపై అనుమానంతో.. అది కూడా మరో స్త్రీ అనే అంశం లేకుండానే హత్యలు.. ఆత్మహత్యలు వరకు జరగడం అరుదు. అలాంటి ఒక దుర్ఘటన ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.


ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నివసించే భాస్కర్ తన భార్య సుప్రీత, ఇద్దరు పిల్లలు కొడుకు(3), కూతురు(7)తో సంతోషంగా జీవించేవాడు. సచివాలయంలో ఉద్యోగం, చిన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులేమీలేవు చాలా హ్యాపీగా జీవనం గడిచపోయేది. కానీ అంతా బాగున్న సమయంలో ఒకరోజు భాస్కర్ పనిమీద తన తోటి స్నేహితుడితో కారులో వేరే ఊర వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకున్నాక చూస్తే ఆ స్నేహితుడు కారులోనే మరణించాడు. దీంతో పోలీసులు విచారణ కోసం భాస్కర్‌ను పిలిచేవారు. అతని ఇంటికి కూడా చేరుకొని దర్యాప్తు చేసేవారు. పోలీసుల ప్రశ్నలకు విసిగిపోయిన భాస్కర్ భార్య సుప్రీత భర్తతో గొడవ పడేది. బహుశా భాస్కరే ఆ హత్య చేశాడేమో! లేకుంటే పోలీసులు ఎందుకు ఇంటివరకూ వస్తారని అనుమానంగా మాట్లాడేది.


అంతేకాదు.. భాస్కర్ అన్న తన భార్యను చంపి జైలు ఉన్నాడని.. వారిది హంతకుల కుటుంబమని ఎత్తిపొడిచేది. ఈ గొడవలతో భాస్కర్ కూడా విసిగిపోయాడు. తాను ఏ హత్య చేయలేదని, పోలీసులు విచారణ అలాగే ఉంటుందని.. ఎంత చెప్పినా.. సుప్రీత తన మాటలతో ఎత్తిపొడవడం ఆపేది కాదు. అనుమానంతో భాస్కర్‌ను మానసికంగా వేధించేది. ఈ గొడవలు, వేధింపులు భరించలేక భాస్కర్ ఒకరోజు తన బిల్లింగ్‌లోని ఆరవ అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో అక్కడున్న వాచ్‌మెన్ ఈ సమాచారం అతని భార్యకు  ఇవ్వాలని పరిగెత్తుకుంటూ వెళ్లి  అతని ఫ్లాట్‌కు వెళ్లడు. అక్కడ అతనికి ఘోరమైన దృశ్యాలు కనిపించాయి. ఇంట్లో సుప్రీత తలకు బలమైన గాయాలున్నాయి. ఇద్దరు పిల్లల తలలు పగిలి నిర్జీవంగా పడి ఉన్నారు. దీంతో అతను పోలీసులకు ఫోన్ చేశాడు.


పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అంతా పరిశీలించారు. చనిపోయే ముందు భాస్కర్ ఒక పెద్ద సుత్తితో తన భార్య, పిలల్ల తలలమీద గట్టిగా దాడిచేశాడు.  భాస్కర్ పైనుంచి దూకినప్పుడే ప్రాణాలు విడిచాడు. ఇంట్లో అతని ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. అతని భార్య సుప్రీత ప్రస్తుతం ఆస్పత్రిలో కొనఊపిరితో ఉంది. పోలీసులకు భాస్కర్ చనిపోయేముందు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో అతను ఇంత దారణానికి ఎందుకు ఒడిగట్టాడో? వివరంగా రాశాడు. 


ఆ రోజు రాత్రి కూడా సుప్రీత తన అనుమానంతో భాస్కర్‌తో గొడవపడిందని, ఆమె తనను అలా అనుమానించడం పైగా.. తన అన్న వైవాహిక జీవితం, తన కుటుంబాన్ని హంతకుల కుటుంబమని ఎత్తిపొడవడం తాను సహించలేకపోతున్నానని రాశాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయాక పిల్లలు అనాథలుగా జీవించకూడదని వారిని కూడా హత్య చేస్తున్నందుకు బాధగా ఉందని వివరించాడు. ఇదంతా జరగడానికి కారణమైన తన భార్యను కూడా హత్య చేస్తున్నట్లు రాశాడు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement