ఫోన్లో గొడవపడిన వెంటనే భార్యకు మళ్లీ కాల్.. మీ భర్త ఉరేసుకున్నాడంటూ సమాచారం.. అంతా నమ్మారు కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో..

ABN , First Publish Date - 2021-09-29T06:14:11+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్ నగరంలోని ఒక లాడ్జిలో గత బుధవారం(సెప్టెంబర్ 22) రోజు ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కలకలం రేపింది. ఆ డాక్టర్ చనిపోయేముందు తన భార్యతో ఫోన్లో గొడవపడుతూ మాట్లాడినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా పోలీసులు విచారణలో గొడవ జరిగినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో అందరూ అది ఆత్మహత్య అని నమ్మేశారు. కానీ అది ఆత్మహత్య కాదని తెలిసి...

ఫోన్లో గొడవపడిన వెంటనే భార్యకు మళ్లీ కాల్.. మీ భర్త ఉరేసుకున్నాడంటూ సమాచారం.. అంతా నమ్మారు కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో..

మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్ నగరంలోని ఒక లాడ్జిలో గత బుధవారం(సెప్టెంబర్ 22) రోజు ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కలకలం రేపింది. ఆ డాక్టర్ చనిపోయేముందు తన భార్యతో ఫోన్లో గొడవపడుతూ మాట్లాడినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా పోలీసుల విచారణలో గొడవ జరిగినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో అందరూ అది ఆత్మహత్య అని నమ్మేశారు. కానీ అది ఆత్మహత్య కాదని తెలిసి అందరూ షాకయ్యారు.


వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఉమేరియాకి చెందిన డాక్టర్ జీతేంద్ర(34) తన స్నేహితుడు నిషాద్‌తో కలిసి రాయ్‌పూర్‌ నగరంలో హోటల్ సందీప్‌ అనే లాడ్జిలో ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. తాము షాపింగ్ కోసం రాయ్‌పూర్ వచ్చామని హోటల్ వారికి చెప్పారు. అనుకోకుండా ఆ రోజు రాత్రి డాక్టర్ జీతేంద్ర లాడ్జిలోని తన రూంలో శవమై తేలాడు. రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకొన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అందరినీ విచారణ చేశారు. అప్పుడు అక్కడే ఉన్న నిషాద్(డాక్టర్ స్నేహితుడు) జరిగిన విషయం చెప్పాడు. ఉదయం నుంచే డాక్టర్ జీతేంద్ర తన భార్యతో ఫోన్లో గొడవ పడుతున్నాడని, తాను భోజనం తీసుకు రావడానికి కాసేపు కిందకు వెళ్లి వచ్చేసరికి డాక్టర్ జితేంద్ర చనిపోయి ఉన్నాడని చెప్పుడు. పోలీసుల దర్యాప్తులో డాక్టర్ గొడవ పడిన విషయం నిజమని తేలింది. కానీ పోస్టుమార్టం రిపోర్టు మాత్రం తేడాకొట్టింది.


పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం డాక్టర్ జితేంద్ర గొంతు నులపడం వల్ల జరగిందని చూసి పోలీసులు ఖంగుతిన్నారు. ఆ వెంటనే పోలీసులు నిషాద్(డాక్టర్ స్నేహితుడు)ని అనుమానంతో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిషాద్‌ భయంకరమైన నిజాలు చెప్పాడు.


పోలీసుల కథనం ప్రకారం జితేంద్రను చంపడానికే నిషాద్ ఆ లాడ్జి వద్దకు తీసుకొచ్చాడు. జితేంద్ర, నిషాద్ ఇద్దురు ఆప్తమిత్రులు, వారి కుటంబాలు కూడా సన్నిహితంగా ఉండేవి.  అంతా బాగుందనుకున్న సమయంలో నిషాద్ తల్లితో డాక్టర్‌కు అక్రమ సంబంధం ఉందని నిషాద్‌కు తెలిసిపోయింది. 


డాక్టర్ జితేంద్రకు ముందు నుంచే తన భార్యతో పడదు. ఈ విషయం తెలిసిన నిషాద్ డాక్టర్‌ను చంపడానికి పక్కా ప్లాన్ వేశాడు. జితేంద్రను గొంతు నులిపి చంపేసి ఆ తరువాత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేశాడు. అది ఒక ఆత్మహత్యగా అందరినీ నమ్మించాడు. కానీ పోస్టుమార్టం రిపోర్టుతో బుక్కయ్యాడు. ప్రసుతం పోలీసులు అతడిని హత్యా నేరం కింద అరెస్టు చేశారు.

Updated Date - 2021-09-29T06:14:11+05:30 IST