ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ వల్ల ఓ నిండు కుటుంబం బలి.. పరువు పోతోందని ఆ భర్త ఎంత దారుణానికి తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-08-24T22:09:56+05:30 IST

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుని, తిరిగి కట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య

ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ వల్ల ఓ నిండు కుటుంబం బలి.. పరువు పోతోందని ఆ భర్త ఎంత దారుణానికి తెగించాడంటే..

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుని, తిరిగి కట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. ఇండోర్‌ (Indore)కు చెందిన ఓ వ్యక్తి తాజాగా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి దర్యాఫ్తునకు ఆదేశించారు. ఇండోర్‌కు చెందిన అమిత్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ.3 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బులను తిరిగి కట్టలేక తన పిల్లలు, భార్యను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. 


ఇది కూడా చదవండి..

Zomato Delivery Partner: ఇద్దరు పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్.. `రియల్ హీరో` అంటూ నెటిజన్ల ప్రశంసలు


`నాకు జీవించాలనే కోరిక ఉంది. కానీ నా పరిస్థితులు ఆత్మహత్యకు దారి తీసేలా ఉన్నాయి. నేను చాలా ఆన్‌లైన్ యాప్‌ల నుంచి రుణం తీసుకున్నాను. ట్రూ బ్యాలెన్స్, మోబి పాకెట్, మనీ వ్యూ, స్మార్ట్ కాయిన్, రూపీ వంటి యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నాను. అవి తిరిగి చెల్లించలేకపోతున్నాను. పరువు పోతుందనే భయంతో ఈ అడుగు వేస్తున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను, అత్తగారు, మామగారిని ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు. పాన్ కార్డ్ హోల్డర్ మరణిస్తే ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు. 


నేను నా సోదరుడిని, తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తున్నాను. ఈ లేఖను నా కుటుంబ సభ్యులకు తప్పక అందజేయండి. అమ్మా.. నేను వెళ్తున్నాను` అని అమిత్ ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర  హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. అమిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొత్తం ఘటనపై ద్యర్యాఫ్తునకు ఆదేశించారు. యాప్ లోన్ పద్ధతులు అభ్యంతరకరంగా అనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-08-24T22:09:56+05:30 IST