Abn logo
Sep 23 2020 @ 12:50PM

సుక్మా అడవుల్లో యువకుడిని చంపిన నక్సలైట్లు

Kaakateeya

సుక్మా (ఛత్తీస్‌ఘడ్): సుక్మా అటవీ గ్రామంలో 22 ఏళ్ల యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన వెలుగుచూసింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా పోలీసుస్టేషను పరిధిలోని మిసీగూడ ప్రాంతంలో 22 ఏళ్ల యువకుడిని మావోయిస్టులు కాల్చిచంపారు. కుందేడ్ గ్రామానికి చెందిన హుంగాగా మృతుడిని గుర్తించారు. ఈ నెల 11వతేదీన ఇంద్రావతి పులుల అభయారణ్యంలో ఫారెస్ట్ రేంజర్ ను నక్సలైట్లు హతమార్చారు. మావోయిస్టు వరుస హత్యలతో సుక్మా జిల్లాలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పోలీసులు అప్రమత్తమై నక్సలైట్ల కదలికలపై గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement