ప్రేమించిన అమ్మాయి కోసం పోలీసులనే బంధించిన యువకుడు

ABN , First Publish Date - 2022-05-31T10:32:35+05:30 IST

తను ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు మరొకరితో వివాహం నిశ్చయించారని తెలిసి ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తుపాకీ తీసుకొని ఆమె ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వారిని తుపాకీ బెదిరిస్తూ కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పులు విని పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు పోలీసులు ఇంట్లోకి వెళ్లగా.. వారిని కూడా ఆ ప్రేమోన్మాది బంధించాడు...

ప్రేమించిన అమ్మాయి కోసం పోలీసులనే బంధించిన యువకుడు

తను ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు మరొకరితో వివాహం నిశ్చయించారని తెలిసి ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తుపాకీ తీసుకొని ఆమె ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వారిని తుపాకీ బెదిరిస్తూ కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పులు విని పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు పోలీసులు ఇంట్లోకి వెళ్లగా.. వారిని కూడా ఆ ప్రేమోన్మాది బంధించాడు. ఈ ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. వెస్ట్ చంపారన్ జిల్లా మోతిహారి ప్రాంతానికి చెందిన సతీష్(25) అనే యువకుడు స్థానికంగా నివసించే ఒక స్కూల్ టీచర్ కూతురిని ప్రేమించాడు. కానీ వారి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా ఆమెను మరో యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన సతీష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక తుపాకీ తీసుకొని తన ప్రియురాలి ఇంట్లోకి దూసుకెళ్లాడు. వారిని బెదిరించేందుకు తుపాకీతో కాల్పులు చేశాడు. కాల్పుల శబ్ధం విని ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిలో ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆ ముగ్గురు ఇంట్లోకి వెళ్లగా.. వారిని కూడా సతీష్ ఒక గదిలో బంధించాడు. ఈ విషయం ఆ ముగ్గురు పోలీసులు పై అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంది. సతీష్ ఎవరిపైనా కాల్పులు జరపకుండా ఉండడానికి బయటినుంచి ఆ బృందం అతడిని శాంతపరిచింది. చాలా చాకచాక్యంగా సినీఫక్కీలో సతీష్‌ని అరెస్టు చేశారు. 


Updated Date - 2022-05-31T10:32:35+05:30 IST