50 లక్షలు కావాలంటూ యువకుడి కిడ్నాప్.. డబ్బు సమయానికి ఇవ్వకపోవడంతో.. దారుణం

ABN , First Publish Date - 2021-10-20T13:03:19+05:30 IST

బీహార్‌లోని నలందా నగంలో నితీశ్(20) అనే యువకుడి కిడ్నాప్ కేసు కలకలం రేపింది. నలందా నగరంలో విద్యుత్ ఆఫీస్‌లో పనిచేసే ఉర్మిళా దేవి కుమారుడు నితీశ్. అక్టోబర్ 16న ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాని చెప్పి తన తల్లి వద్ద రూ.150 తీసుకొని బయలుదేరాడు. ఊర్మిళా దేవి కూడా ఆ తరువాత ఆఫీసుకి బయలు దేరింది. సాయంత్రం వరకూ నితీశ్ ఇంటికి రాలేదు...

50 లక్షలు కావాలంటూ యువకుడి కిడ్నాప్.. డబ్బు సమయానికి ఇవ్వకపోవడంతో.. దారుణం

బీహార్‌లోని నలందా నగంలో నితీశ్(20) అనే యువకుడి కిడ్నాప్ కేసు కలకలం రేపింది. నలందా నగరంలో విద్యుత్ ఆఫీస్‌లో పనిచేసే ఉర్మిళా దేవి కుమారుడు నితీశ్. అక్టోబర్ 16న ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాని చెప్పి తన తల్లి వద్ద రూ.150 తీసుకొని బయలుదేరాడు.  ఊర్మిళా దేవి కూడా ఆ తరువాత ఆఫీసుకి బయలు దేరింది. సాయంత్రం వరకూ నితీశ్ ఇంటికి రాలేదు. 


కొడుకు ఏమైపోయాడోనని ఊర్మిళా దేవి బెంగపెట్టుకుంది. అతనికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. రాత్రి నితీశ్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ చేసింది నితీశ్ కాదు. అతడిని కిడ్నాప్ చేసిన దుండగులు. తమకు రూ. 50 లక్షలు ఇవ్వకపోతే నితీశ్‌ని చంపేస్తామని బెదిరించారు. పోలీసుల వద్దకు వెళితే నితీశ్‌ ప్రాణాలతో దక్కడని అన్నారు.


ఉర్మిళా దేవి వద్ద అంత డబ్బులు అప్పుడు లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ చేయగా.. ఉర్మిళా దేవికి తన సోదరుడి కుమారుడు దీపక్‌తో గొడవలు ఉన్నట్లు తెలిసింది. దీపక్ ఒక స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు అనుమానంతో దీపక్‌ను అరెస్టు చేశారు. అప్పుడు దీపక్ వారికి జరిగినదంతా చెప్పాడు.


పోలీసుల కథనం ప్రకారం.. దీపక్ సోదరి పెళ్లి కోసం అతని తండ్రి ఊర్మిళా దేవి వద్ద అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బులు సమయానికి తిరిగివ్వలేక  కొంత భూమిని ఆమె పేరుపై రాసిచ్చాడు. ఆ భూమి ధర ఇప్పుడు కోట్లు పలుకుతోంది. దీంతో దీపక్ తన మేనత్త ఊర్మిళపై కోపం పెంచుకున్నాడు. ఆ భూమి తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా ఆమెతో పలుమార్లు గొడవపడ్డాడు. చివరికి తన మేనత్త కుమారుడైన నితీశ్‌ని కిడ్నాప్ చేశాడు. కానీ ఊర్మిళా దేవి డబ్బు ఇవ్వకపోవడంతో నితీశ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.


ఆ తరువాత నితీశ్ శవాన్ని ముక్కలు చేసి నదిలో విసిరేశాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో దీపక్ ఇల్లు, అతను పనిచేసే స్కూలులో వెతికారు. వారికి స్కూలు ప్రాంగణంలో నితీశ్ శవ అవశేషాలు దొరికాయి.  నితీశ్‌ను కిడ్నాప్ చేయడంలో దీపక్‌తోపాటు మరో వ్యక్తి అతనికి సహాయం చేశాడు. ప్రస్తుతం పోలీసులు దీపక్‌పై కిడ్నాప్, హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-20T13:03:19+05:30 IST