Germanyలో ఓ వృ‌ద్ధుడు 90 కొవిడ్ టీకాలు వేయించుకున్నాడు...

ABN , First Publish Date - 2022-04-07T16:40:26+05:30 IST

కొవిడ్ మహమ్మారి నివారణకు ఏకంగా 90 కొవిడ్ టీకాలు వేయించుకున్న వృద్ధుడి ఉదంతం జర్మనీ దేశంలో వెలుగుచూసింది....

Germanyలో ఓ వృ‌ద్ధుడు 90 కొవిడ్ టీకాలు వేయించుకున్నాడు...

బెర్లిన్: కొవిడ్ మహమ్మారి నివారణకు ఏకంగా 90 కొవిడ్ టీకాలు వేయించుకున్న వృద్ధుడి ఉదంతం జర్మనీ దేశంలో వెలుగుచూసింది.తూర్పు జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు నకిలీ టీకా కార్డులను విక్రయించడానికి 90 డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్న బాగోతం తాజాగా బట్టబయలైంది. తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలోని టీకా కేంద్రాల్లో జర్మన్ వృద్ధుడు 90 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తేలడంతో జర్మనీ పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు. వ్యాక్సినేషన్ కార్డుల జారీ కోసం వ్యాక్సిన్ వేయించుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ బ్రాండ్లకు చెందిన 90 కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తి ఆరోగ్యంపై టీకాల ప్రభావం ఎలా ఉందనేది తెలియలేదు.


జర్మనీ దేశంలో కొవిడ్ టీకాలు వేయించుకునేందుకు నిరాకరించే వారు ఉన్నారు. బయట తిరిగే వ్యక్తులు అందరూ టీకా తీసుకోవడం తప్పనిసరి. దీంతో వేరే వ్యక్తులు టీకాలు వేయించుకొని వారి పేర్లతో వేరే వాళ్లు వేయించుకొని సర్టిఫికెట్ ను వారికి అందజేస్తున్నారు.


Updated Date - 2022-04-07T16:40:26+05:30 IST