చెల్లి వరుస అయ్యే అమ్మాయితో ప్రేమ.. గర్భవతి అని తేలడంతో దారుణమైన నిర్ణయం.. ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2022-04-04T08:05:55+05:30 IST

చెల్లి వరుస అయ్యే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిన ఒక యువకుడు.. ఆమె గర్భం దాల్చిందని తెలిసి షాకయ్యాడు. ఇక ఆమెను తనతో ఉంచుకోకూడద..

చెల్లి వరుస అయ్యే అమ్మాయితో ప్రేమ.. గర్భవతి అని తేలడంతో దారుణమైన నిర్ణయం.. ఏం జరిగిందంటే?

చెల్లి వరుస అయ్యే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిన ఒక యువకుడు.. ఆమె గర్భం దాల్చిందని తెలిసి షాకయ్యాడు. ఇక ఆమెను తనతో ఉంచుకోకూడదని అనుకున్నాడు. అయితే ఆమెను అలాగే పంపితే తనకు సమస్య అవుతుందని భావించి దారుణానికి ఒడిగట్టాడు. ఇనుప రాడ్డుతో కొట్టి కొట్టి ఆమెను చంపేశాడు. ఈ ఘటన బిహార్‌లో వెలుగు చూసింది. 


బిహార్ రాజధాని పట్నాకు చెందిన ఉత్తమ కుమారి అనే యువతి ఒక యువకుడిని ప్రేమిస్తోందని తెలిసిన తల్లిదండ్రులు ఆమెను బంధువుల ఇంటికి పంపేశారు. అక్కడ ఏడు నెలలపాటు ఉన్న ఆమె తన సోదరుడి వరుస అయ్యే(పెద నాన్న కుమారుడు) అమిత్ కుమార్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే వేరే అబ్బాయితో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఒకసారి అమిత్‌తో పారిపోయిందామె. ఆ సమయంలో తెలిసిన ప్రాంతాలన్నీ వెతికి వాళ్లను పట్టుకున్న ఆమె తల్లిదండ్రులు.. ఉత్తమ్ కుమారిని మరోసారి మెట్టినింటికి పంపేశారు. ఈ క్రమంలో మార్చి 23న మాయమాటలు చెప్పి మరోసారి ఆమెను తన వద్దకు పిలుచుకున్న అమిత్.. ఆమెను తన వద్దే ఉంచుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు కడుపులో విపరీతంగా నొప్పి వస్తోందని ఉత్తమ్ కుమారి చెప్పింది. 


ఆమె గర్భం దాల్చిందేమో అని అమిత్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. ఒక ఇనుప రాడ్డుతో ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పొదల్లో పడేసి పరారయ్యాడు. గుర్తుతెలియని శవం దొరికిందని తెలిసిన పోలీసులు.. యువతిని గుర్తించేందుకు రకరకాలుగా ప్రయత్నించారు. చివరకు ఆమెను ఉత్తమ్ కుమారిగా గుర్తించి, కటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే అమిత్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-04-04T08:05:55+05:30 IST