పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారని తుపాకీతో బెదిరించి...

ABN , First Publish Date - 2021-06-16T16:29:19+05:30 IST

యువతితో తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించారనే కోపంతో యువకుడు అమ్మాయి కుటుంబానికి తుపాకీ చూపించి...

పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారని తుపాకీతో బెదిరించి...

భువనేశ్వర్ (ఒడిశా): యువతితో తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించారనే కోపంతో యువకుడు అమ్మాయి కుటుంబానికి తుపాకీ చూపించి బెదిరించి వారిని ఇంట్లో బంధించిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బోలంగీర్ పట్టణంలో వెలుగుచూసింది. పాండా అనే యువకుడు ఆసుపత్రిలో పనిచేస్తున్న హౌటా అనే తన మేనకోడలితో ప్రేమలో ఉన్నాడు. పాండాకు అమ్మాయినిచ్చేందుకు మహిళ కుటుంబం తిరస్కరించింది. దీంతో పాండా దివ్యలోచన్ హూటా ఇంటికి వచ్చి భార్య, కుమారుడికి తుపాకీ చూపించి బెదిరించి వారిని బందీగా పట్టుకున్నాడు. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి కిటికీ గుండా కుటుంబసభ్యులను బయటకు తీసుకువచ్చారు. నిందితుడు పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-06-16T16:29:19+05:30 IST