Advertisement
Advertisement
Abn logo
Advertisement

ల్యాండింగ్ గేర్‌ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని విమాన ప్రయాణం.. తీరా అది ల్యాండ్ అయ్యాక..

ఇంటర్నెట్ డెస్క్: ఎలాగైన అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్ ఉండే కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని మియామీకి చేరుకున్నాడు. అయితే.. అధికారులు అప్పటికే అతడి గురించి తెలిసుండటంతో  శనివారం విమానం ల్యాండవగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు గ్వాటెమాలా దేశానికి చెందిన వాడని అధికారులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు అతడు ఇలాగే ప్రయాణించాడని సమాచారం. అతడు పోలీసుల అదుపులో తీసుకున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో తమకు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో సెంట్రల్ అమెరికాకు చెందిన అనేక మంది ఇలా ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి అమెరికాకు చేరుకుంటుంటారు. కొందరు అమెరికాలోకి మాదకద్రవ్యాలు తరలించేందుకు కూడా ఇటువంటి రిస్క్ తీసుకుంటారు. 


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement