homework చేయలేదని 8 ఏళ్ల కుమారుడిని ఫ్యాన్‌కు వేలాడదీసిన కసాయి తండ్రి

ABN , First Publish Date - 2021-11-26T13:09:01+05:30 IST

హోంవర్క్ పూర్తి చేయలేదని 8 ఏళ్ల కొడుకును ఫ్యాన్‌కి తలకిందులుగా వేలాడదీసిన కసాయి తండ్రి బాగోతం...

homework చేయలేదని 8 ఏళ్ల కుమారుడిని ఫ్యాన్‌కు వేలాడదీసిన కసాయి తండ్రి

జైపూర్ (రాజస్థాన్): హోంవర్క్ పూర్తి చేయలేదని 8 ఏళ్ల కొడుకును ఫ్యాన్‌కి తలకిందులుగా వేలాడదీసిన కసాయి తండ్రి బాగోతం రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ జిల్లాలో వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో స్కూల్ హోంవర్క్ పూర్తి చేయనందుకు శిక్షగా అమన్ అనే కసాయి తండ్రి తన కొడుకును ఫ్యాన్‌కు తలకిందులుగా వేలాడదీశాడు.నవంబర్ 17వతేదీన బుండి జిల్లాలోని దాబీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.8 ఏళ్ల బాలుడిపై తండ్రి దాడి చేస్తున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ దారుణ ఘటన అనంతరం బాలుడు, అతని తల్లి చిత్తోర్‌గఢ్‌లోని జోగ్నియామాత ప్రాంతానికి వెళ్లి అతని మామకు వీడియో చూపించారు. దీంతో ఆ మహిళ సోదరుడు చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు.


నిందితుడు తన కుమారుడిని కాళ్లు, చేతులు కట్టేసి ఫ్యాన్‌కు వేలాడ దీశాడు. తండ్రి చిన్నారిని కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా అతడి భార్య అడ్డుకుంది.తనను వేలాడ దీయవద్దని చిన్నారి తన తండ్రిని అభ్యర్థిస్తున్నట్లు వీడియోలో చూపించారు. పిల్లవాడిని వేలాడ దీస్తూ తండ్రి క్రూరత్వాన్ని చిత్రీకరించడానికి తల్లి వీడియోను చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా కేసు నమోదు చేయలేదని సమాచారం. నిందితుడి హింసాత్మక స్వభావం కారణంగా కుటుంబ సభ్యులు అతనిపై ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు.అయితే రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఈ కేసుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుని 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బండి జిల్లా ఎస్పీని ఆదేశించింది.


Updated Date - 2021-11-26T13:09:01+05:30 IST