Viral Video: నీళ్లల్లో కనిపించిందో పాము.. ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని దూరంగా విసిరేసి మంచి పనే చేయబోయాడు కానీ..

ABN , First Publish Date - 2022-07-30T20:56:16+05:30 IST

పాములంటే (Snake) చాలా మంది భయపడతారు.. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు..

Viral Video: నీళ్లల్లో కనిపించిందో పాము.. ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని దూరంగా విసిరేసి మంచి పనే చేయబోయాడు కానీ..

పాములంటే (Snake) చాలా మంది భయపడతారు.. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు.. ఇక తాము ఉన్న ప్రదేశంలోనే పాము ఉందని తెలిస్తే వారి భయానికి అంతు ఉండదు..  తాజాగా బీచ్‌లో సేద తీరుతున్న కొందరు వ్యక్తులు పాముకు భయపడి నీటిలోకి దూకేశారు.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.. ఆ వీడియో ప్రకారం ఒక వ్యక్తి బీచ్‌లో తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.  ఆ సమయంలో వారి వైపు ఓ పాము నీటిలో ఈదుకుంటూ రావడాన్ని గమనించాడు. 


పాముకు భయపడకుండా దాని తోక పట్టుకుని పైకి లేపాడు. తాము ఉన్న ప్రదేశం నుంచి దూరంగా విసిరేయాలనే ఉద్దేశ్యంతో నీటిలోకి విసిరాడు. అయితే ఆ పాము నేరుగా వెళ్లి నీటిపై తేలి ఉన్న పరుపుపై సేద తీరుతున్న వారి మధ్యలో పడింది. ఆ పామును చూసి షాకైన వారందరూ ఆ పరుపు నుంచి నీటిలోకి దూకేశారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి Dipanshu Kabra ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటికే 1.77 లక్షల వ్యూస్ దక్కించుకుంది. 



Updated Date - 2022-07-30T20:56:16+05:30 IST