ఇంటర్నెట్ డెస్క్: కొందరు పాములను చేతిలో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తారు. మరికొందరేమో అది కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తారు. ఈ రెండవ కోవకు చెందిన ఓ యువకుడి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత ఆ యువకుడు చేసిన పని చూసి.. నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
ఓ యువకుడు స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి షాపింగ్ చేస్తుండగా.. అక్కడకు సడన్‌గా పాము ఎంట్రీ ఇచ్చింది. ఆ పామును గమనించిన యువకుడు భయాందోళనలతో పరుగులు తీశాడు. ఈ క్రమంలో కొందరు నవ్వడాన్ని గమనించిన ఆ యువకుడు.. దాన్ని బొమ్మపాముగా గుర్తించాడు. కొందరు తనను ప్రాంక్ చేస్తున్నట్టు గ్రహించాడు. వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు.. బొమ్మపామును చేతిలోపట్టుకుని దాన్ని విరిచేయడానికి ప్రయత్నించాడు. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. బొమ్మపామును చూసి పరుగులు తీసిన యువకుడిని చూసి, నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు.
ఇవి కూడా చదవండి