14 ఏళ్లకు దొరికిన పర్సు

ABN , First Publish Date - 2020-08-10T06:52:46+05:30 IST

ఎప్పుడో 14 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు ఇప్పుడు దొరికింది. అందు లోని రూ.900 కూడా దొరికాయి. ఈ విచిత్రం ముంబైలో జరిగింది. హేమంత్‌ పడాల్కర్‌ అనే వ్యక్తి 2006లో ఓ లోకల్‌ రైలులో ప్రయాణి స్తుండగా తన పర్సును పోగొట్టుకున్నాడు...

14 ఏళ్లకు దొరికిన పర్సు

ముంబై, ఆగస్టు 9: ఎప్పుడో 14 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు ఇప్పుడు దొరికింది. అందు లోని రూ.900 కూడా దొరికాయి. ఈ విచిత్రం ముంబైలో జరిగింది. హేమంత్‌ పడాల్కర్‌ అనే వ్యక్తి 2006లో ఓ లోకల్‌ రైలులో ప్రయాణి స్తుండగా తన పర్సును పోగొట్టుకున్నాడు. వెం టనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత అతడు ఆ విషయాన్నే మర్చిపోయాడు. కానీ పోలీసులు మర్చిపోలేదు. ‘నీ పర్సు దొరికింది’ అంటూ పోలీసులు ఏప్రిల్‌ నెలలో హేమంత్‌కు ఫోన్‌ చేశారు.


లాక్‌ డౌన్‌ సడలింపుల తర్వాత ఇప్పు డెళ్లి పర్సును తీసుకున్నాడు. ఆశ్చ ర్యంగా పర్సులోని సొమ్ము అలాగే ఉంది. స్టాంపు డ్యూటీ కింద పోలీ సులు రూ.100 మినహాయించు కొని రూ.300 చేతిలో పెట్టారు. మరో రూ.500 రద్దయిన నోటు కావ డంతో బ్యాంకులో మార్చి ఇస్తామన్నారు. చిన్న కేసును ఛేదించడానికి 14 ఏళ్ల సమయం తీసుకున్నందుకు విమర్శించాలా.. కేసును మూసేయకుండా, ఛేదించే వరకూ వదిలిపెట్టని వారి చిత్తశుద్ధిని అభినందించాలా? అనే సందిగ్ధంలో హేమంత్‌ పడ్డాడు. 

Updated Date - 2020-08-10T06:52:46+05:30 IST