రోడ్డుపైన దొరికిన ఒక బ్యాగు.. అందులో రివాల్వర్.. దొంగచాటుగా అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-12-25T07:41:03+05:30 IST

సాయంత్రం ఇంటికి వెళుతున్న ఒక వ్యక్తికి అనుకోకుండా దారిలో ఒక బ్యాగు దొరికింది. అది బరువుగా ఉండడంతో తెరిచి చూస్తే అందులో ఒక రివాల్వర్ ఉంది. దానిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడంటే..

రోడ్డుపైన దొరికిన ఒక బ్యాగు.. అందులో రివాల్వర్.. దొంగచాటుగా అతను ఏం చేశాడంటే..

సాయంత్రం ఇంటికి వెళుతున్న ఒక వ్యక్తికి అనుకోకుండా దారిలో ఒక బ్యాగు దొరికింది. అది బరువుగా ఉండడంతో తెరిచి చూస్తే అందులో ఒక రివాల్వర్ ఉంది. దానిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడంటే..


ఢిల్లీలో నివసించే సంజయ్ వర్మ(43) ఒక బంగారు నగల షాపులో పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఒక కొడుకు రోహన్(4) ఉన్నాడు.  ఒకరోజు అతను సాయంత్రం ఇంటికి వెళుతున్న దారిలో ఒక పార్కు ఉంది. అక్కడ ఒక బెంచ్‌పై ఒక బ్యాగు ఉంది. దాని చుట్టు పక్కల ఆ సమయంలో ఎవరూ లేరు. దాంట్లో ఏముందో చూద్దామని తెరిచి చూస్తే.. అందులో ఒక రివాల్వర్ కనిపించింది. రివాల్వర్‌ని పోలీసులకు అప్పజెప్పకుండా సంజయ్ ఇంటికి తీసుకెళ్లాడు. దానిని ఒక అల్‌మారీలో దాచిపెట్టాడు. 


మరుసటి రోజు సంజయ్.. ఎవరూ లేని సమయంలో ఆ రివాల్వర్‌ని బయటుతీసి దానిని పరీశీలిస్తుండగా.. ఒక్కసారిగా అది పేలింది. అయితే అంతకుముందే అక్కడికి సంజయ్ కొడుకు రాహుల్ వెనుకనుంచి వచ్చాడు. ఆ రివాల్వర్‌ పేలి బుల్లెట్ పొరపాటున రాహుల్‌కు తగిలింది. దీంతో రాహుల్ రక్తపు మడుగులో కిందపడిపోయాడు. వెంటనే రాహుల్‌ని తీసుకొని సంజయ్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు బుల్లెట్ గాయం చూసి పోలీసులకు సమాచారం అందించారు. 


పోలీసులకు విచారణ చేసేసరికి సంజయ్ సరిగా సమాధానం చెప్పలేదు. రివాల్వర్‌ విషయం వెల్లడించలేదు. దీంతో.. పోలీసులు అతడి ఇంటిని తనిఖీ చేసి రివాల్వర్‌ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్‌ లైసెన్స్ లేకుండా అక్రమంగా ఒక రివాల్వర్ ఉండడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేయలేదు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండడంతో.. పోలీసులు ఇంకా సంజయ్‌ని అరెస్టు చేయలేదు. 

Updated Date - 2021-12-25T07:41:03+05:30 IST