నా పెళ్లిని చెడగొడతావా..? అంటూ ఆ యువకుడు కోపంతో నాలుగు నెలల గర్భవతి అని కూడా చూడకుండా కడుపుపై..

ABN , First Publish Date - 2021-11-11T13:27:42+05:30 IST

తన కోపం తనకే శత్రువు అని అన్నారు పెద్దలు. అలా కోపంలో ఒక యువకుడు చేసిన పనికి ఒక మహిళ తన గర్భంలో పెరుగుతున్న బిడ్డను పోగొట్టుకుంది. అసలు ఏం జరిగిదంటే..

నా పెళ్లిని చెడగొడతావా..? అంటూ ఆ యువకుడు కోపంతో నాలుగు నెలల గర్భవతి అని కూడా చూడకుండా కడుపుపై..

తన కోపం తనకే శత్రువు అని అన్నారు పెద్దలు. అలా కోపంలో ఒక యువకుడు చేసిన పనికి ఒక మహిళ తన గర్భంలో పెరుగుతున్న బిడ్డను పోగొట్టుకుంది. అసలు ఏం జరిగిదంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరం నివసించే నిక్కీ అనే యువకుడు తన వదిన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో వివాహం చేసుకోవాలనుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి కోసం సంబంధం మాట్లాడారు. అంతా బాగుందనుకున్న సమయంలో అతని వదిన(పెదనాన్న కోడలు) రచన ఈ సంబంధం మంచిది కాదని చెప్పింది. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.


నిక్కీ ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. ఇప్పుడు సంబంధం కలవకపోవడంతో చాలా బాధపడ్డాడు. తన వదిన ఇలా ఎందకు చేసిందో నిలదీయడానికి అమె వద్దకు వెళ్లాడు. నిక్కీ వరుసకు తన వదిన అయిన రచనను పెళ్లి ఆపడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. నిక్కీ ఆ సమయంలో చాలా కోపంలో ఉన్నాడు. నిక్కీ అడిగిన ప్రశ్నకు రచన బదులిస్తూ ఆ అమ్మాయి తనకు కూతురు వరుస అని ఆ కారణంగా నిక్కీకి కూడా కూతురి వరుస అని చెప్పింది. ఆమె చెప్పిన సమాధానంతో నిక్కీ కోపం చల్లార లేదు. ఎవరో దూరపు బంధుల అమ్మాయి తనకు కూతురు ఎలా అవుతుందని వాదించాడు.


దానికి రచన 'ఇక చాలు ముందు బయటికి పో' అని చెప్పింది. నిక్కీ ఎంతో కోపంతో ఉన్నాడు. రచనపై ఒక్కసారిగా దాడిచేశాడు. ఆమెను చితకబాదాడు. రచన కడుపుపై కాలితో తన్నాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న రచన భర్త అడ్డుపడగా అతడిని కూడా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రచనను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం రచన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. నిక్కీపై రచన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిక్కీ ప్రస్తుతం పరారీ ఉన్నాడు. కోపంలో నిక్కీ చేసిన పనికి ప్రస్తుతం అతనే చిక్కుల్లో పడ్డాడు. 


Updated Date - 2021-11-11T13:27:42+05:30 IST