సోదరి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.. బావని ఇరికించేందుకు ఎలాంటి స్కెచ్ వేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-12T08:48:29+05:30 IST

అతను మాస్టర్ పే కంపెనీలో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.. దుకాణదారుల నుంచి డబ్బులు వసూలు చేసి కంపెనీలో డిపాజిట్ చేస్తుంటాడు.. తన సేకరించిన రూ.7.80 లక్షలను దొంగలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు...

సోదరి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.. బావని ఇరికించేందుకు ఎలాంటి స్కెచ్ వేశాడంటే..

అతను మాస్టర్ పే కంపెనీలో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.. దుకాణదారుల నుంచి డబ్బులు వసూలు చేసి కంపెనీలో డిపాజిట్ చేస్తుంటాడు.. తన సేకరించిన రూ.7.80 లక్షలను దొంగలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో అతడిని తమదైన శైలిలో విచారించగా దోపిడి ఫేక్ అని తేలింది. బావని ఇరికించేందుకు అతను వేసిన స్కెచ్ అని బయటపడింది.


వివరాల్లోకి వెళితే.. నోయిడా బహలోల్‌పూర్ నివాసి సునీల్ కుమార్ మాస్టర్ పే కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. గత నెల 27వ తేదీన పోలీసులకు ఫోన్ చేసి.. రూ.7.80 లక్షలను వైశాలి మెట్రో సమీపంలో దొంగలు దోచుకెళ్లినట్లు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లన్నింటినీ పరిశీలించారు. అయితే ఎక్కడా ఆ ఘటన రికార్డ్ కాలేదు. దీంతో సునీల్‌ను తమదైన విచారించిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. ఆ దోపిడీ ఫేక్ అని బయటపెట్టారు. సునీల్ తన బావమరిదిని ఇరికించేందుకు అలా చేసినట్టు చెప్పాడు. అతని బావ కూడా మాస్టర్ పే కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. 


సునీల్ చెప్పిన వివరాల ప్రకారం.. అతడి సోదరి మూడు నెలల క్రితం ప్రసవ సమయంలో మృతి చెందింది. ఆ సమయంలో తన బావ సరైన వైద్యం తన సోదరికి చేయించలేదని, భార్య చనిపోయిన మూడు నెలల్లోనే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని, అతనికి గుణపాఠం చెప్పాలని ఇలా ప్లాన్ చేశానని సునీల్ చెప్పాడు. ఆ చోరీ కేసును తన బావ మీదకు నెట్టెయ్యాలనుకున్నానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్‌ను అరెస్ట్ చేశారు. 


Read more