మొసలితో కారులో ప్రయాణం.. యువకుడి అరెస్టు..

ABN , First Publish Date - 2022-02-11T01:14:21+05:30 IST

మొసలితో కారులో ప్రయాణించిన కాలిఫోర్నియా యువకుడిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

మొసలితో కారులో ప్రయాణం.. యువకుడి అరెస్టు..

ఇంటర్నెట్ డెస్క్: మొసలితో కారులో ప్రయాణించిన కాలిఫోర్నియా యువకుడిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఓ డ్రైవర్ కారు తోలుతున్నాడన్న ఫిర్యాదు అందడంతో.. పోలీసులు ఉత్తర కాలిఫోర్నియాలోని ఆండర్సన్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న అతడు అకస్మా్త్తుగా కారు వెనుక సీట్లో మొసలి ఉన్నట్టు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. కారు డోర్ తీసి చూస్తే.. సీటు కింద ఓ మొసలి పిల్ల కనిపించింది. దీంతో.. అధికారులు జంతుసంరక్షకులకు సమాచారం అందించారు. 


ఆ మొసలి తన స్నేహితుడిదని నిందితుడు టైలర్ వాట్సన్ పోలీసులకు తెలిపాడు. వారం క్రితం తన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో.. అతడి మొసలిని తాను కొన్ని రోజుల పాటు సంరక్షించాల్సి వచ్చిందని నిందితుడు చెప్పుకొచ్చాడు. అడవి జంతువులను బంధించడం, పెరోల్ ఉల్లంఘించడం వంటి నేరాలకు పాల్పడినట్టు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఆ మొసలిని చేతిలో పట్టుకుని పోలీసులు దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-02-11T01:14:21+05:30 IST