Abn logo
Oct 27 2020 @ 11:35AM

కాలేజీ అమ్మాయి కారెక్కలేదని యువకుడు ఏం చేశాడంటే...

Kaakateeya

ఫరీదాబాద్ (హర్యానా) : కళాశాలలో ఓ అమ్మాయి తన కారెక్కలేదనే కోపంతో ఓ యువకుడు ఆమెను తుపాకీతో కాల్చిచంపిన దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ నగరంలో వెలుగుచూసింది. 21 ఏళ్ల వయసున్న ఓ కళాశాల విద్యార్థిని ఫరీదాబాద్ కళాశాలలో పరీక్షలు రాసి బయటకు వచ్చింది. అక్కడికి కారులో వచ్చిన ఓ యువకుడు ఆ కళాశాల అమ్మాయిని కారు ఎక్కమని కోరాడు. దీంతో కళాశాల విద్యార్థిని కారు ఎక్కలేదు. దీంతో ఆమెను అపహరించేందుకు ప్రయత్నించిన యువకుడు అమ్మాయి ప్రతిఘటించిందనే కోపంతో ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. బుల్లెట్ గాయమైన అమ్మాయిని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించినా, అప్పటికే ఆమె మరణించిందని ఏసీపీ జైవీర్ సింగ్ చెప్పారు. బాధితురాలు, నిందితులు ఒకరికి మరొకరు తెలుసని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితుడిని మేవాట్ వాసిగా గుర్తించామని, అతన్ని అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.

Advertisement
Advertisement