వైరు తగిలి గాల్లోకి లేచిన వ్యక్తి.. ఎదురుగా మహిళ రావడంతో!

ABN , First Publish Date - 2020-08-01T04:08:51+05:30 IST

రోడ్డుపై లూజుగా వేలాడుతున్న వైరు ఓ ఆటో టైరులో ఇరుక్కుంది.

వైరు తగిలి గాల్లోకి లేచిన వ్యక్తి.. ఎదురుగా మహిళ రావడంతో!

బెంగళూరు: రోడ్డుపై లూజుగా వేలాడుతున్న వైరు ఓ ఆటో టైరులో ఇరుక్కుంది. దాన్ని తొలగించడం కోసం ఆటోడ్రైవర్ కిందకు దిగాడు. ఇంతలో ఏమైందో ఆ వైరు ఒక్కసారిగా బలంగా గాల్లోకి లేచింది. దాన్ని పట్టుకొనే ఉన్న ఆటోడ్రైవర్ ఒక్క ఉదుటున గాల్లోకి లేచాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న సునీత అనే 42ఏళ్ల మహిళను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె గాయాలకు 52 కుట్లు పడ్డాయి. అయితే అనూహ్యంగా ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కు ఎటువంటి హానీ జరగలేదు.

Updated Date - 2020-08-01T04:08:51+05:30 IST