కిచెన్‌లోకి ఫర్నీచర్‌ను కొన్న వ్యక్తి.. కప్‌బోర్డ్‌లో కనిపించిందో బ్యాగ్.. దాంట్లో ఏముందో చూసి మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2022-04-29T00:35:54+05:30 IST

కిచెన్‌లోకి కావాల్సిన ఫర్నీచర్‌ను ఓ వ్యక్తి కొనుగోలు చేయాలని భావించాడు. అయితే కొత్త ఫర్నీచర్ కొనడానికి కావాల్సిన డబ్బులు అతడి దగ్గర లేవు. దీంతో సెకండ్ హ్యాండ్‌లో దాన్ని కొనేందుకు ఆసక్తి చూపించాడు. ఇం

కిచెన్‌లోకి ఫర్నీచర్‌ను కొన్న వ్యక్తి.. కప్‌బోర్డ్‌లో కనిపించిందో బ్యాగ్.. దాంట్లో ఏముందో చూసి మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: కిచెన్‌లోకి కావాల్సిన ఫర్నీచర్‌ను ఓ వ్యక్తి కొనుగోలు చేయాలని భావించాడు. అయితే కొత్త ఫర్నీచర్ కొనడానికి కావాల్సిన డబ్బులు అతడి దగ్గర లేవు. దీంతో సెకండ్ హ్యాండ్‌లో దాన్ని కొనేందుకు ఆసక్తి చూపించాడు. ఇందులో భాగంగానే వెబ్‌సైట్లను వెతకడం ప్రారంభించాడు. ఇంతలో అతడికి ఓ ఫర్నీచర్ కనిపించింది. వెంటనే దాన్ని ఆర్డర్ చేశాడు. తీరా ఆ ఫర్నీచర్ డెలివరీ అయ్యాక అందులో ఏముందో చూసి అతడి మైండ్ బ్లాక్ అయింది. కాగా.. ఇంతకూ విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..



జర్మనీకి చెందిన థామస్ హెల్లర్ అనే వ్యక్తి కిచెన్‌కు సంబంధించిన సెకండ్ హ్యాండ్ ఫర్నీచర్‌ను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత డెలివరీ ఏజెంట్ ఆ ఫర్నీచర్‌ను డెలివరీ చేశాడు. ఈ క్రమంలో ఫర్నీచర్ అంతటిని థామస్ తన కిచెన్‌లో సర్దే పనిలో పడ్డాడు. ఇంతలో ఓ కప్‌బోర్డులో అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగులో ఉన్న బాక్సు ఓపెన్ చూసి అతడు షాకయ్యాడు. అందులో £1,30,000 (సుమారు రూ.1.2కోట్లు) ఉండటంతో కంగుతిన్నాడు.


వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ డబ్బులు ఎవరివో ఎంక్వైరీ చేసి వారికి ఇవ్వాల్సిందిగా పేర్కొన్నాడు. దీంతో అధికారులు విచారణ జరిపి, ఆ డబ్బులు 91ఏళ్ల వృద్ధురాలివిగా గుర్తించారు. డబ్బులను కప్‌బోర్డులో పెట్టిన విషయం గుర్తులేక, ఆమె ఓ ఏజెంట్ ద్వారా దాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా వాటిని ఆమెకు అందజేశారు. ఇదిలా ఉంటే.. జర్మనీలోని నిబంధనల ప్రకారం.. ఎవరికైనా £8.41 లేదా అంతంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే ఆ మొత్తాన్ని పోలీసులకు అప్పగించాలి. ఆ డబ్బులను దాచుకుంటే అక్కడ నేరంగా పరిగణిస్తారు.




Updated Date - 2022-04-29T00:35:54+05:30 IST