ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో... సినీఫక్కీలో పెద్ద మాయ చేసిన యువకుడు.. చివరికి మొబైల్ ఫోన్‌తో సీన్ రివర్స్..

ABN , First Publish Date - 2022-01-25T09:47:42+05:30 IST

ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెద్ద ప్లాన్ వేశాడు. తన ప్రియురాలు, స్నేహితులతో కలిసి తన హత్య జరిగినట్టు మాయ చేశాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాలో...

ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో... సినీఫక్కీలో పెద్ద మాయ చేసిన యువకుడు.. చివరికి మొబైల్ ఫోన్‌తో సీన్ రివర్స్..

ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెద్ద ప్లాన్ వేశాడు. తన ప్రియురాలు, స్నేహితులతో కలిసి తన హత్య జరిగినట్టు మాయ చేశాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లా పరిధి బలువా టోలా గ్రామానికి చెందిన మున్నా(22) అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించుకున్నాడు. ఆమెను పెళ్లిచేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో గొడవపడి వెళ్లిపోయాడు. ఆ రోజు సాయంత్రం మున్నా స్నేహితులు అతని తల్లిదండ్రులకు ఒక షాకింగ్ సమాచారం అందించారు. ఎవరో మున్నాని హత్యచేసి రోడ్డుపై పడేశారని చెప్పారు. 


దీంతో మున్నా తల్లిదండ్రులు ఘటనా స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ అక్కడ ఏ మృతదేహం దొరకలేదు. ఆ స్థలంలో రక్తం పడి ఉంది. అది చూసి ఎవరో మున్నా శవం మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవం లభించకపోకడంతో పోలీసులు మున్నా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 

మున్న మృతదేహం కోసం గ్రామం పరిసరాల్లో ఉన్న చెరువులు, నది, డంపింగ్ యార్డు అన్నీ వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. అనుకోకుండా పోలీసులకు మున్నా సెల్ ఫోన్ స్విచాన్ అయినట్టు సమాచారం తెలిసింది. దాన్ని ట్రాక్ చేస్తూ లొకేషన్‌కు చేరుకోగా.. అక్కడ మున్నా, తన ప్రియురాలితో ఒక అద్దె ఇంట్లో సజీవంగా ఉన్నాడు.


పోలీసులు మున్నా, అతని ప్రియురాలిన అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌ తీసుకెళ్లి ప్రశ్నించారు. తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో తను చనిపోయినట్టు నాటకం ఆడానని.. అలా చేసి తరువాత కొన్ని రోజుల తరువాత ఇంటికెళితే.. వారు తను కోరింది చేస్తారని ఇదంగా చేశానని పోలీసులకు చెప్పాడు. 

Updated Date - 2022-01-25T09:47:42+05:30 IST