జైలు శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఫేక్ డేత్ స‌ర్టిఫికేట్.. చివ‌రికి

ABN , First Publish Date - 2020-07-22T19:11:26+05:30 IST

దొంగ‌త‌నం కేసులో ఏడాది జైలు శిక్ష ప‌డిన ఓ వ్య‌క్తి... ఆ శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఫేక్ డేత్ స‌ర్టిఫికేట్ త‌యారు చేయించాడు.

జైలు శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఫేక్ డేత్ స‌ర్టిఫికేట్.. చివ‌రికి

న్యూయార్క్: దొంగ‌త‌నం కేసులో ఏడాది జైలు శిక్ష ప‌డిన ఓ వ్య‌క్తి... ఆ శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఫేక్ డేత్ స‌ర్టిఫికేట్ త‌యారు చేయించాడు. తాను చనిపోయిన‌ట్లు సంబంధిత శాఖ వారు ఇచ్చిన‌ట్లు న‌కిలీ మ‌ర‌ణ ధృవ ప‌త్రాన్ని సృష్టించిన స‌ద‌రు వ్య‌క్తి అందులో చేసిన చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వ‌ల్ల కోర్టులో దొరికిపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే... న్యూయార్క్‌లోని హంటింగ్టన్‌కు చెందిన రాబర్ట్ బెర్గర్(25) అనే వ్య‌క్తికి దొంత‌గ‌త‌నం కేసులో స్థానిక న్యాయ‌స్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. కానీ, బెర్గ‌ర్ శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఒక ప్లాన్‌ వేశాడు. త‌న త‌ర‌ఫు న్యాయ‌వాదితో న్యూజెర్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌, వైటల్ స్టాటిస్టిక్స్ అండ్‌ రిజిస్ట్రీ వారు ఇచ్చిన‌ట్లు ఫేక్ డేత్ స‌ర్టిఫికేట్ త‌యారు చేయించాడు. అనంత‌రం దానిని కోర్టులో స‌మ‌ర్పించారు.


అయితే, ఆ డేత్ స‌ర్టిఫికేట్‌లో 'Registry'అనే ప‌దం 'Regsitry'గా ఉండ‌టం ప్రాసిక్యూట‌ర్‌కు అనుమానాన్ని రేకెత్తించింది. దాంతో అనుమాన నివృత్తి కోసం సంబంధిత శాఖ వారికి నేర‌స్తుడి త‌ర‌పు న్యాయ‌వాది స‌మ‌ర్పించిన స‌ర్టికేట్‌ను పంపించారు. ఆ మ‌ర‌ణ ధృవ ప‌త్రాన్ని ప‌రిశీలించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌, వైటల్ స్టాటిస్టిక్స్ అండ్‌ రిజిస్ట్రీ శాఖ వారు అది న‌కిలీది అని తేల్చారు. దీంతో బెర్గ‌ర్‌కు ఇంత‌కుముందు దొంగ‌త‌నం కేసులో ఉన్న ఏడాది జైలు శిక్ష‌తో పాటు.. ఇప్పుడు న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదొవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నించినందుకు గాను అద‌నంగా మ‌రికొంత కాలం జైలులో ఉండాల్సిన ప‌రిస్థితి దాపురించింది.  



Updated Date - 2020-07-22T19:11:26+05:30 IST